ఈ ఎన్నికల హడావుడిలో ఉన్న మన రాష్ట్ర ప్రజలు మరచి పోతున్న అతి కీలకమైన అంశం, అంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విభజన చట్టం,2014 సెక్షన్.5(2) ప్రకారం ఈరోజు అర్ధరాత్రి 12 గంటల సమయం నుంచి హైదరాబాద్ నగరం తెలంగాణా రాష్ట్రం రాజధానిగా సంపూర్ణంగా బదలాయింపు జరగ బడుతుంది.

అనగా ఈరోజు అర్ధరాత్రి నుంచి అంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా చట్టపరంగా గుర్తింపు లభిస్తూన్నది. ఇదోక అరుదైన ఘటన. చరిత్రలో అటువంటి చరిత్ర గతంలో ఇజ్రాయిల్ దేశస్తులకు మాత్రమే కలిగినట్లు గుర్తు. అక్కడ వారు, తమ దేశాన్ని ఏర్పాటు చేసుకోని, రాజధాని నిర్మాణం చేసుకున్నారు.

కాకపోతే, మనకు రాష్ట్రం ఏర్పడిన తరువాత పది సంవత్సరాల తరువాత కూడా, రాజధాని చట్టపరంగా లేని దౌర్భాగ్య పరిస్ధితి, కేవలం జగన్ రెడ్డి పాలన వలన మాత్రమే జరిగింది. 

ఇది జగన్ రెడ్డి అంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన అరుదైన ఘనకీర్తి అందామా? ఏమైనా చరిత్రలో నిలచే అంశం. 

ఏది ఏమైనా, ఇక్కడ రాష్ట్రంలో, అక్కడ కేంద్రంలో ప్రభుత్వాలు కుదురుకున్న తరువాత ఈ జూన్ నెలలో పరిష్కారింప బడాల్సిన అత్యంత కీలకమైన, ప్రధానమైన అంశం.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: