జమ్మలమడుగు పట్టణం లోని ముద్దనూరు రోడ్డు నందు పతంగి రామన్న ఉన్నత పాఠశాల క్రీడా మైదానం లో క్రీడాకారులకు,విద్యార్థులకు ఉపయోగపడని పిల్లర్ లను ఉన్నతాధికారులు తొలగించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) పట్టణ కార్యదర్శి నంద్యాల.తులసిశ్వర యాదవ్ తెలిపారు.శనివారం నాడు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పీ.ఆర్ హైస్కూల్ క్రీడా మైదానంలో నిరుపయోగంగా ఉన్న పిల్లర్ లను పరిశీలించారు.
ఈ సందర్భంగా తులసిశ్వర్ మాట్లాడుతూ చాలా సంవత్సరాలుగా జమ్మలమడుగు పట్టణంలో పతంగి రామన్న ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఎవ్వరికీ ఉపయోగపడకుండ క్రీడాకారులకు పాఠశాల కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆటలాడుకోవడానికి అడ్డుగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ పరంగా ఆటల పోటీలు నిర్వహించాలంటే ఇవి మరి అడ్డుగా కూడా వున్నాయి అన్నారు.సంవత్సరాలు గడుస్తున్నా అధికారులు ఈ మొండి పిల్లర్ లను ఎందుకు తొలగించడం లేదు అన్నారు.అంటే కాకుండా క్రీడా మైదానం అన్యక్రాంతంకు గురి అవుతున్నదని అన్నారు.ఒకప్పుడు రాష్ట్ర స్థాయి లాంటి అథ్లెటిక్స్ వంటివి పోటీలు కూడా నిర్వహించారని అన్నారు.పట్టణంలోని ప్రజలకు,యువతకు క్రీడా మైదానం అణువుగా ఉన్నన్నారు. ఈ స్థాయిలో జిల్లాలో ఎక్కడ లేదు అన్నారు. అధికారులు స్పందించి పతంగి రామన్న ఉన్నత పాఠశాల క్రీడా మైదానం పరిరక్షణకై చర్యలు చేపట్టాలని అడ్డుగా ఉన్న పీ ల్లర్లను తొలగించాలని డివైఎఫ్ఐ యువజన సంఘం డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు సూరి,రాఘవ,కేశవ తదితరులు పాల్గొన్నారు
Post A Comment:
0 comments: