నంద్యాల జిల్లా... మల్లెల తెలుగుతేజం 


 *ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా వివిద రాజకీయ పార్టీలు,ప్రజలు పాటించవలసిన నియమ నిభందనలు...*

 *జిల్లా ఎస్పీ శ్రీ K.రఘువీర్ రెడ్డి IPS గారు* 


నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ K.రఘువీర్ రెడ్డి IPS గారు నేడు నంద్యాల జిల్లా కలెక్టర్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా వివిద రాజకీయ పార్టీలు,ప్రజలు పాటించవలసిన నియమ నిభందనల గురించి వివరించడం జరిగింది.

1).ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు వారి ఏజెంట్లు మినహా ఇతరులు ఎవ్వరూ రావడానికి అనుమతి లేదు. 

2). ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ మరియు 30 పోలీసు ఆక్ట్ అమలులో ఉంటుంది.

3).కౌంటింగ్ రోజు కళాశాల ప్రవేశ ద్వారం వద్ద విధులు నిర్వహించే పోలీసు అధికారులు సిబ్బంది కళాశాల లోపలికి వచ్చు ప్రతి ఒక్కరిని తనిఖీ చేస్తారు కావున అభ్యర్థులు వారి ఏజంట్లు RO మరియు కలెక్టర్ గారి దృవీకరణ పత్రంతో పాటు ఏదైనా గుర్తింపు కార్డులను మీ వెంట తెచ్చుకోవాలి.లేనిచో లోపలికి అనుమతించడం జరుగదు.

4).ఎన్నికల కౌంటింగ్ కు వచ్చేవారు మొబైల్స్ ఇతర ఎలక్ట్రికల్ పరికరాలు మరియు అగ్గిపెట్టెలు సిగరెట్లు ఎట్టి పరిస్థితుల్లో తీసుకురాకూడదు.
 
5).ఏజెంట్లు ఒక్కసారి కౌంటింగ్ కేంద్రం లోపలికి వెళ్లిన తర్వాత కౌంటింగ్ పూర్తి అయ్యేవరకు బయటకు వెళ్లడానికి వీలు లేదు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే ముందుగానే వాటికి సంబంధించిన మందులు వెంట తెచ్చుకోవాలి.

6).ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు, క్రాకర్స్ (టపాకాయలు) కాల్చటకు అనుమతిలేదు. 

7).టపాసులు మరియు ఇతర పేలుడు పదార్థాలను ఎక్కడ కూడా నిలువ ఉంచుకోకూడదు, నిభందనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు.

8).మీ నియోజకవర్గము నుండి ఏజెంట్లు తప్ప మిగిలిన వారు ఎవరు కూడా మండలం కేంద్రం కు కానీ, నియోజకవర్గ కేంద్రానికి కానీ,  జిల్లా కేంద్రానికి కానీ మరియు కౌంటింగ్ కేంద్రం వద్ద కానీ తీసుకొని రాకూడదు.

9).సోషల్ మీడియాలో వచ్చే ఊహాజనిత వార్తలను నమ్మి ఎట్టి పరిస్థితుల్లో వాటికి స్పందించరాదు మరియు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రకటనలు మరియు పోస్టులు పెట్టి ఏదైనా గొడవలకు కారణమైతే వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది.
పార్కింగ్ వివరాలు 

👉 *RGM హాస్టల్ క్యాంపస్*
 
ఇందులో కౌంటింగ్ కు హాజరు అయ్యే అధికారులు మరియు సిబ్బంది,మీడియా మిత్రులకు చెందిన వాహనాలు మాత్రమే అనుమతించబడును.

👉 *కేశవరెడ్డి స్కూల్*
 
ఇందులో శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ,నందికొట్కూర్ నియోజకవర్గాలకు సంబంధించిన వారి వాహనాలు పార్టీలు వారిగా నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే పార్కింగ్ చేసుకోవాలి . 

👉 *బీసీ వెల్ఫేర్ స్కూల్* 

ఇందులో డోన్,బనగానపల్లి నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీకి సంబందించిన వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి.

👉 *ఎస్టీ వెల్ఫేర్ స్కూల్* 

ఇందులో డోన్,బనగానపల్లి నియోజకవర్గానికి YSRCP పార్టీకి సంబందించిన వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి.

పై నిభందనలను ఎవ్వరూ ఉల్లంఘించరాదు.

ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలవద్ద ఎస్పీ ,ఒక అదనపు ఎస్పీ,DSP లు -4,CI లు -23,SI లు 35, ASI/HCలు-68,PCలు-133,HGలు-101 మంది విదులలో ఉంటారు.వీరు కాక స్పెషల్ పార్టీ,BSF బలగాలు,AR సిబ్బంది,APSP సిబ్బంది కూడా విదులలో ఉంటారు.మరియు జిల్లాలోని 75 సమస్యాత్మక ప్రాంతాలలో పోలీసు పికెట్ లు ఏర్పాటు చెయ్యడం జరిగింది.ప్రతి పోలీసు స్టేషన్ పరిదిలో పెట్రోలింగ్ పార్టీలను QRT లను,స్పెషల్ పార్టీ టీం లను  ఏర్పాటు చెయ్యడం జరిగింది.పార్టీ కార్యాలయాలవద్ద, ప్రదాన పార్టీ అభ్యర్థుల ఇళ్ల వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చెయ్యడం జరిగింది.ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి వచ్చే మార్గాలలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చెయ్యడం జరిగింది.RGM,శాంతిరామ్ ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ కళాశాల ప్రాంతం మొత్తం కౌంటింగ్ వరకు రెడ్ జోన్ గా ఏర్పాటు చెయ్యడం జరిగింది కావున ఎవ్వరూ డ్రోన్ లను ఎగురవేయ్యారాదు.నిభందనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

జిల్లా పోలీసు కార్యాలయం,నంద్యాల
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: