దోచుకుని దాచుకున్న జగన్‌ ఇంట్లోని ఫర్నీచర్‌.. విలువైన వస్తువులను ప్రభుత్వానికి లెక్కచెప్పి అప్పజెప్పాలి

ప్రభుత్వ సొమ్ముతో ఇలా విచ్చలవిడితనం చేసాడు ఇంకా ఎన్ని ఘోరాలు బయట పడతాయో..!

-- ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ (16 జూన్ 2024)

అసెంబ్లీలో ఉన్న ఒక కుర్చీ, సోపా తన క్యాంప్ కార్యాలయంలో ఉందని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై కేసు పెట్టిన వైసీపీ ప్రభుత్వం.. ఆయనను దొంగగా ముద్ర వేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మండిపడ్డారు. కోడెల మరణానికి జగనే కారణమని ఆరోపించారు.

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఫైర్‌ అయ్యారు. ఆదివారం ఒక ప్రకటనలో ఆమె మాట్లాడుతూ, తాడేపల్లిలో జగన్‌ తన సొంత ఇంటి కోసం.. నిబంధనలకు విరుద్ధంగా తన ఇంటిని సీఎం క్యాంప్ కార్యాలయంగా మార్చుకుని, దీని కోసం సుమారు రూ. కోట్ల ప్రజాధనం దోచుకున్నారని ఆరోపించారు. దోచుకుని దాచుకున్న జగన్‌ ఇంట్లోని ఫర్నీచర్‌.. విలువైన వస్తువులను ప్రభుత్వానికి లెక్కచెప్పి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో ఉన్న ఒక కుర్చీ, సోపా తన క్యాంప్ కార్యాలయంలో ఉందని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై కేసు పెట్టిన వైసీపీ ప్రభుత్వం.. ఆయనను దొంగగా ముద్ర వేసి. ఆత్మహత్య చేసుకునేలా చేశారని సౌమ్య మండిపడ్డారు. కోడెల మరణానికి జగనే కారణమని, కోడెల మాదిరి జగన్‌కు ఆత్మగౌరవం ఉందనుకోవట్లేదని అన్నారు. జగన్.. ఏ అఘాయిత్యం చేసుకోవద్దని అన్నారు. ఫర్నీచర్‌, ఇతర విలువైన వస్తువులను.. ప్రభుత్వానికి అప్పగిస్తే చాలని తంగిరాల సౌమ్య అన్నారు.

కాగా అసెంబ్లీలో ఉన్న ఒక కుర్చీ, సోపా తన క్యాంప్ కార్యాలయంలో ఉందని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై కేసు పెట్టిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా జగన్ ఇంట్లోనే ప్రభుత్వ ఫర్నీచర్ ఉంటే ఏం సమాధానం చెబుతారని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పైగా జగన్ క్యాంపు నివాసానికి సెక్యూరిటీ, ఫర్నీచర్ రూపేన రూ. 3 కోట్ల 63 లక్షల వ్యయం చేసిన జీవోను కూడా బయటకు తీశారు. 2024 ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ప్రజలు తీర్పు ఇవ్వడంతో ఇప్పుడు తన క్యాంపు కార్యాలయంలో ఉన్న ప్రభుత్వ ఫర్నీచర్‌ను జగన్ ఎందుకు వెనక్కి పంపలేదని నిలదీస్తున్నారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: