పల్నాడు జిల్లాలో నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతుల పాపం ఎవరిది వ్యవసాయ శాఖ దా ఉద్యాన శాఖ దా???


 ఒక్క రోజైనా నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను ఏ ఒక్క శాఖైనా పరామర్శించిందా!!!!


 జిల్లాస్థాయి అధికారులపై ఆరోపణలు వస్తున్న ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుంది....


 2023 సంవత్సరానికి సంబంధించి పల్నాడు జిల్లా వ్యాప్తంగా పత్తి మిర్చి పంటలను రైతులు సాగు చేశారు. రెండుసార్లు తుఫాను కారణంగా రైతులు నష్టపోయారు. ఈ తరుణంలోనే నకిలీ మిర్చి విత్తనాలతో పల్నాడు జిల్లాలోని పలు మండలాలలో  రైతులు లక్షల రూపాయలు నష్టపోయారు. అలానే అక్కడక్కడ పత్తి విత్తనాలతో కూడా రైతులు నష్టపోవడం జరిగింది. మరి నష్టపోయిన రైతులను ఒక్కరోజైనా వ్యవసాయ శాఖ జిల్లా అధికారులు కానీ ఉద్యాన శాఖ జిల్లా అధికారులు గాని పరామర్శించారా అంటే శూన్యం అని చెప్పుకోవచ్చు. జిల్లాలోని వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ అధికారులపై రైతులు గుర్రుగా ఉన్నారు. మరీ ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారులు పై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నా కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రతి షాపు దగ్గర ముడుపులు ముట్టాయా అంటూ ప్రజలు మాట్లాడుతున్నప్పటికీ పట్టీ పట్టనట్లుగా జిల్లా స్థాయి అధికారులు ఉన్నారంటే మరి రాజకీయ బలం పెద్ద ఎత్తున ఉంది అని చెప్పకనే చెప్పవచ్చు. ఏది ఏమైనా నష్టపోయిన నకిలీ విత్తనాల విషయంలో రైతుల బాధను అర్థం చేసుకోలేని రెండు శాఖలు కూడా రాబోయే రోజుల్లో కచ్చితంగా మూల్యం చెల్లించవలసి వస్తుందని రైతులు తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడితే మీడియాలో వచ్చిన ప్రతి వార్తను కూడా  ద్వితీయ శ్రేణి అధికారులకు చూపిస్తూ వారిపై మండిపడుతూ  వారి చేత తనిఖీలు చేపిస్తూ మరికొంత అవినీతికి చేతులు చాపుతున్నారంటూ ఈరోజు నష్టపోయిన రైతులు మాట్లాడుతున్నారు. కచ్చితంగా  రాబోయే రోజుల్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత  వ్యవసాయ శాఖ మరియు ఉద్యాన శాఖ అధికారులపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని అలానే రైతులను పట్టించుకోని సదరు జిల్లా అధికారులపై వేటు వేయాలని పల్నాడు జిల్లా వ్యాప్తంగా రైతులు మాట్లాడుతున్నారు. అలానే ప్రభుత్వం నష్టపోయిన రైతుల విషయంలో వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ చెబుతున్నట్లు ఆ లాట్ లో మోసం జరిగింది ఈ లాటులో మోసం జరిగిందంటూ చెప్పకుండా ఏ కంపెనీ విత్తనాల ద్వారా అయితే రైతులు నష్టపోయారో ఆ కంపెనీ ద్వారా రైతులకు నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: