విజయనగరం జిల్లా పోలీసు||


85 డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ.8.50 లక్షల జరిమానా

 విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్


 మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులపై విస్తృతమవుతున్న పోలీసు తనిఖీలు


 మద్యం సేవించి పట్టుబడితే రూ. 10వేలు జరిమానా లేదా జైలుశిక్ష విధిస్తున్న న్యాయ స్థానాలు


 ఒక్క రోజునే డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ.8.50 లక్షలు జరిమానాగా చెల్లించిన 85 మంది వాహనదారులు


మద్యం సేవించి వాహనాలు నడిపి, పట్టుబడిన వాహనదారులు ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానాను

విజయనగరం అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ ఎం.ఎస్.హెచ్.ఆర్. తేజ చక్రవర్తి గారు విధించారని జిల్లా

ఎస్పీ వకుల్ జిందల్ మే 17న తెలిపారు.


జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో విజయనగరం ట్రాఫిక్ సిఐ సూరి నాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్

పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, మద్యం సేవించి, వాహనాలు నడిపిన వారిపై 85 కేసులు నమోదు చేసి, విజయనగరం అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వారి వద్ద హాజరుపర్చగా,

మెజిస్ట్రేట్ శ్రీ ఎం.ఎస్.హెచ్.ఆర్. తేజ చక్రవర్తి గారు ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున మొత్తం 85 మందికి రూ.8.50

లక్షలను జరిమానగా విధించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.


మద్యం మత్తులో వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురవ్వడం లేదా ఇతర వాహనాలను ఢీ కొట్టి ప్రమాదాలకు

కారకులవుతున్నారన్నారు. ఈ తరహా వాహనదారులను కట్టడి చేసేందుకు, ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రతీరోజూ నిర్వహిస్తున్న విజిబుల్ పోలీసింగులో భాగంగా ప్రత్యేకంగా డ్రంకన్ డ్రైవ్ చేపట్టి, డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు

చేపడుతూ, మద్యం సేవించి, వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నామని జిల్లా ఎస్పీ వకుల్

జిందల్ తెలిపారు.


జిల్లా పోలీసు కార్యాలయం

||విజయనగరం.||

Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: