వడ్ల కొనుగోలును వేగవంతంగా పూర్తి చేయాలి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు..!!


 హైదరాబాద్ డా.బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం నుండి రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావులు యాసంగి ధాన్యం సేకరణ పై జిల్లా కలెక్టర్లు,అదనపు కలెక్టర్లు, సంబందిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వడ్ల కొనుగోలు విషయంలో ప్రతి రైతు ఇబ్బందిపదకుండా, నష్టపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరిస్తుందని, ఇప్పటికే ధాన్యం కొనుగోలు చివరి దశలో ఉందని, ఇంకా రానున్న పది పదిహేను రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందని ఈ మద్యలో అనుకోని వర్షాల వల్ల, అధిక ఉష్నోగ్రతల వల్ల రైతులకు ఇబ్బందులు కలుగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.


రాష్ట్రంలోని జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా మిల్లులకు త్వరగా తరలించేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అదే విధంగా వర్షాలు పడుతున్నందున వడ్ల కొనుగోలు కేంద్రాలలో సరిపడా టార్పాలిన్లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, గన్ని బ్యాగులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు.ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటలలో రైతుల ఖాతాలలో జమ చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా సన్న వడ్లకు బోనస్ ను అందజేస్తుందని అన్నారు. కొన్ని చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ప్రచురితమైన వార్తలపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తూ తప్పుడు వార్తలపై స్పందించి వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ ) కె.వీరాబ్రహ్మచారి, సంబంధిత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.


ఈ సందర్బంగా కలెక్టర్ వివరిస్తూ గత సీజన్ తో పోలీస్తే ఈ సారి కొనుగోలు నాలుగింతలు పెరిగిందన్నారు. అందుకు తగినట్లుగా జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 1 లక్షా 16 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, సుమారు 1 లక్షా 03 వేల ధాన్యాన్ని మిల్లులకు తరలించామని, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రత్యేకంగా అధికారులు నియమించి రవాణా తదితర ఏర్పాట్లపై పకడ్బందీ చర్యలు తీసుకున్నామని నిత్యం పర్యవేక్షణ చేస్తూ ఎక్కడ జాప్యం లేకుండా ఇబ్బందులు లేకుండా జిల్లా వ్యాప్తంగా చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు,ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్డిఎ మధుసూదన రాజు, డిసిఓ వెంకటేష్వర్లు, డిఎస్ఓ ప్రేం కుమార్, డిఎంసివిల్ సప్లై అధికారి కృష్ణవేణి, డి.ఎ.ఓ విజయ నిర్మల, డిహెచ్ఓ మరియన్న, ట్రాన్స్పోర్ట్ అధికారి సాయి చరణ్, తదితరులు పాల్గొన్నారు.

Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: