పరిమళించిన మానవత్వం....

పేద కుటుంబం పై పోలీసుల పెద్ద మనసు

 సమాజంలో విలువలు మానవత్వం కోల్పోతున్న సమయంలో ఒక పేద కుటుంబంలో ఆ కుటుంబ పోషకుడు మరణిస్తే మేమున్నామంటూ హుజురాబాద్ పోలీసుల పెద్దమనస్సు చూపడంతో ప్రజలంతా శభాష్ పోలీసు అంటున్నారు. వివరాల్లోకెళ్తే  హుజురాబాద్  మండలంలోని ధర్మరాజు పల్లి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకున్న విషయం విధితమే.  ధర్మరాజు పల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన కోట లక్ష్మణ్ మంగళవారం అనారోగ్యంతో మరణిస్తే గ్రామస్తులంతా కలిసి దహన సంస్కారాలు నిర్వహించారు. హుజురాబాద్ పోలీసులు కూడా మేమున్నాం అంటూ ఆ కుటుంబానికి అండగా నిలిచారు.  గురువారం ఏసీపీ ఆధ్వర్యంలో లక్ష్మణ్ కుటుంబానికి నిత్యవసర వస్తువులతో పాటు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ జీ మాట్లాడుతూ లక్ష్మణ్ ఘటన తమను చాలా బాధకు గురి చేసిందని అన్నారు. 
లక్ష్మణ్ కుటుంబానికి అండగా ఉంటామని వారి పిల్లల చదువుకు పోలీసుల తరఫున సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ టౌన్ సిఐ తిరుమల్ గౌడ్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 


.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: