నరసరావుపేటలో అక్షయ పాత్ర ఫౌండేషన్ 80వ కేంద్రీకృత వంటగదికి భూమి పూజ

-రూ. 15 కోట్ల అంచనాలతో నిర్మాణం

-15000 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భోజన సదుపాయం

-అన్నా క్యాంటిన్ లకు భోజన సరఫరా

-ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కృషితో పల్నాట ఈ కేంద్రం ఏర్పాటు


దేశంలో ఆహార సమస్య, పోషకాహార లోపాలను పరిష్కరిస్తూ శుభ్రతతో రుచికరమైన భోజనాన్ని అందిస్తున్న అక్షయ పాత్ర వారి ఆహార పంపిణీ కేంద్రం పల్నాడులో ఏర్పాటు కాబోతుంది. నరసరావుపేట మండలం, కేసానుపల్లి గ్రామ దగ్గరలో ఎకరం స్థలంలో,, అక్షయ పాత్ర ఫౌండేషన్ వారి 80వ వంటగదికి "భూమి పూజ" వేడుకను ఈరోజు నిర్వహించారు. సుమారు రూ.15 కోట్ల అంచనాలతో కిచెన్ నిర్మాణం జరగనుంది. పల్నాడుతో పాటు పరిసర ప్రాంతాల్లోని 15000 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రుచికరమైన ఆహారాన్ని అందించే లక్ష్యంగా, అన్న క్యాంటీన్ లకు భోజనం పంపిణీ చేసేలా ఈ కిచెన్ నిర్మాణం జరుగుతుంది. ఈ సందర్బంగా టీడీపీ ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు గారు మాట్లాడుతూ.. 

గత కొన్ని సంవత్సరాలుగా పల్నాడు జిల్లాలో అక్షయ పాత్ర ఫౌండేషన్ ను తీసుకురావడానికి  ఎంతో కృషి చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,దాతల మద్దతుతో ఈ రోజు 80వ కేంద్రీకృత వంటగదికి భూమి పూజ చేసాము. అక్షయ పాత్ర పోషకమైన, హైజెనిక్, ఆహార భద్రత, పాఠశాల పిల్లలకు రుచికరమైన ఆహారాన్ని అందించేదిగా గుర్తించబడిందని, నర్సరావుపేటలోని పాఠశాల పిల్లలు ఈ కార్యక్రమంతో ప్రయోజనం పొందుతారని,  సమాజానికి గొప్ప సహకారం అందించినందుకు అక్షయ పాత్ర బృందం,  దాతలందరికీ  కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట శాసన సభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారు, పల్నాడు జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గారు, అక్షయ పాత్ర ఫౌండేషన్, హరే కృష్ణ మూవ్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ అధ్యక్షుడు వంశీధర దాసు, ట్రస్ట్ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: