*శ్రీ లక్ష్మీ గణపతి హోమం, గో పూజా- గో సేవ..*






డాక్టర్ వేదాంతం గోవిందం రామానుజాచార్యులు  వెంకటేశ్వర స్వామి పీఠాధిపతులు ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం తాళ్లగుమ్మూరు శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమం గోపూజ,గోసేవ నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామివారు మాట్లాడుతూ హిందూ ధర్మం ఏ విధంగా కాపాడాలో భక్తులకు వివరించారు. రాబోయే రోజుల్లో హిందు బంధువులు అందరూ కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని అలాగే శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం కూడా అభివృద్ధి రాబోయే రోజుల్లో జరుగుతుందని స్వామీజీ తెలియజేశారు.

స్వామివారి ఆలయం అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని  హామీ ఇచ్చారు.

హోమం ఘనంగా నిర్వహించారు భక్తులు పలువురు పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు విశ్వహిందూ మహాసంగ్ భారత్, భద్రాచలం ,తెలంగాణ రాష్ట్ర సభ్యులు పాల్గొన్నారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: