*కుక్కల భయంతో ప్రాణాలు గుప్పెట్లో*
*రోడ్డు వెంట వెళ్తున్న వారిని వెంబడించి మరీ కరుస్తున్నాయి*
వీధి కుక్కలు చెలరేగిపోతున్నాయి. పగలు-రాత్రి, అనే తేడా లేకుండా మిదపడుతూ రెచ్చిపోతున్నాయి. కనిపించిన వారినల్లా కరుస్తూ.. ఆస్పత్రి పాలుచేస్తున్నాయి. కాలినడకన వెళ్లే వారిపైనే కాదు.. బైక్‌లపై వెళ్తున్న వారిని కూడా వదలడం లేదు. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో కొందరు వాహనదారులు కిందపడిపోతున్నారు. గాయాలు పాలవుతున్నారు ఈ ప్రాంతం.. ఆ ప్రాంతం అని కాదు.. నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలే ఎక్కువగా చోటు చేసుకున్నాయి.
తాజాగా నిడమర్రులో వీధి కుక్కలు పేట్రేగిపోయాయి. ఒకే రోజు నలుగురిపై కరవడానికి దాడి చేశాయి. అంతమందిపై కుక్కలు దాడి చేయడంతో.. స్థానికుల్లో భయాందోళన నెలకొంది. బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. వీధి కుక్కల నుంచి రక్షణ కల్పించాలని అధికారులను కోరుతున్నారు.
గ్రామ పంచాయితీ పాలకులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలనీల్లో వీధి కుక్కల బెడద పెరిగిందని.. వాటిని జంతు సంరక్షణ కేంద్రాలకు తరలించాలన్న విజ్ఞప్తులు వస్తున్నాయి. కుక్కలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. వెటర్నరీ విభాగంలో సిబ్బంది సంఖ్య కొరత ఉంది అసలు ఉద్యోగి ఉంటాడో లేదో తెలియని పరిస్తితి ఉన్నా మందులు వైద్యం రెండూ కొరతే గ్రామంలో విస్తృతంగా ఉన్న కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని గ్రామ వాసులు డిమాండ్ చేస్తున్నారు. కానీ పాలక సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. మనుషుల ప్రాణాలను తీస్తున్నా.. వీధి కుక్కలను జనావాసాల నుంచి ఎందుకు తరలించడం లేదని మండిపడుతున్నారు.
కుక్కల బెడద నుంచి గ్రామవాసులను కాపాడేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గత నెల రోజులుగా జరుగుతున్న దాడులు చూసి అదే తరహా ఘటనలు మరిన్ని జరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా జరిగిన తరువాత ఆలోచించే కంటే జరగక ముందే మేల్కొంటే మంచిదని భావిస్తున్నారు ఈ మధ్య
నిడమర్రు గ్రామంలో ఎక్కడినుండో బయటనుండి అధిక సంఖ్యలో వ్యానులపై తెచ్చి వందల సంఖ్యలో కుక్కల్ని కాలని ప్రాంతంలో వదిలేయడంతో అవి గ్రామమంతా తిరుగుతూ గ్రామస్తులను భయంతో బయటకు రాకుండా చేస్తున్నాయి అసలు బయటకు రావాలంటే బెంబేెత్తుతున్నారు బడికి వెళ్ళిన చిన్న పిల్లల ఇంటికి చేరే వరకు తలిదండ్రులు హడలెత్తిపోతున్నారు గ్రామం అంతటా అలవాటు లేని కొత్త కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి ఏదైనా పని ఉండి బయటకి వెళ్ళాలన్నా తిరిగి రావాలన్నా భయంతో అడుగులు వేస్తూ వస్తున్నారు చీకట్లో అర్జంట్ పని ఉందని వెళ్ళినా వచ్చినా అంతే సంగతులు ఈ విషయం గ్రామ పాలకులకు చెప్పినా ఫలితం లేకపోయింది ఏక్షణం ఎవరికి ఏమోవుతుందో నని భయంతో పరుగులు పెడుతున్నారు నిడమర్రు గ్రామస్తులు
Post A Comment:
0 comments: