*'మంగళాంబిక'ఉత్సవం* క్రోధినామవిజయదశమి సందర్భం గా కాకినాడ భోగి గణపతి పీఠంలో మంగళాంబిక ఉత్సవా న్ని ఘనంగా నిర్వహిం చారు. స్థానిక సూర్యారావుపేట దూసర్లపూడి వారి వీధిలో వేంచేసి యున్న స్వయంభు పీఠంలో శనివారం ఉదయం సుప్రభాత వేళలో విష్వ క్సేన పూజతో శ్రీవారి 54వ జపయజ్ఞ పారా యణ నిర్వహించారు. తొలుతగా రాతి శిలా విగ్రహ గణపతికి వేంకటేశ్వర స్వామి పంచలోహ విగ్రహాలకు పంచామృత అభిషేకం జరిగింది. మామిడి రావి జమ్మి మర్రి మేడి కొమ్మ లతో ధాన్యపు రాశిపై కనకదుర్గమ్మ అమృత కలశాన్ని ప్రతిష్టించి సహస్రనామ పారాయ ణతో పసుపు కుంకుమ లతో పూజలు చేపట్టా రు. ఉపవాసకులకు అమ్మవారి గాజులు రవికలతో తాంబూలా లు ప్రదానం చేసారు. మంగళహారతి అనంత రం మంగళకరమైన విజయదశమి ప్రాశస్త్యా న్ని పీఠంతెలియజేసిం ది. ప్రకృతిని జాగృతం చేసే ఆశ్వీయుజ మాసం గా.. మానవాళికి లోక కళ్యాణం సిద్ధించే అమృత ఉత్సవంగా.. కలియుగంలో ప్రారబ్ద కర్మల సర్వదోష నివార ణకు అమ్మను ఆరాధిం చుకునే పవిత్ర వేడుకగా పేర్కొన్నారు. జమ్మి మేడి మర్రి రావి మామి డి కొమ్మలతో ఆరాధన చేయడం వలన ప్రకృతి తత్వంలో ఇమిడివున్న అమ్మ వారి తత్వచింత న మరింతగా శోభిల్లు తుందన్నారు. భాద్రపద మాసం నుండి ఆరాధకు ల దర్శనం కోసం పీఠం లోని స్వయంభు గర్భా లయం తలుపులు ఏడాది పొడవునా 24 గంటలు తెరిచేవుంచు తున్నామన్నారు. పగలు రాత్రి సమయా లలో ఏ వేళలో నైనా భోగిగణపతి మంగళ కర స్వయంభుస్వరూ పాన్ని దర్శించుకోవచ్చ న్నారు. శ్రీవారి సేవా సమితి ఆధ్వర్యంలో రానున్న కార్తీక మాసం మొదటి సోమవారం నాడు సముద్రహారతి రెండవ వారంలో కార్తీక వనహారతి జరుగుతుం దని తెలియజేసారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: