దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్ష వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బిజెపి నాయకులు ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ చేపట్టలేని గొప్ప కార్యక్రమాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేపడుతోందని బిజెపి నాయకులు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కులగణన సర్వే వల్లే కేంద్ర ప్రభుత్వం సర్వే చేపడుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే తప్పుల తడక సర్వే అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పటిష్టంగా కులగణన సర్వే చేపట్టి, కులాల ప్రాతిపాదికన అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తుందన్నారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: