*జూన్ 1వ తేదీన ఆఖరిగా 7వ విడత ఎన్నికలు*



*జూన్ 1 సాయంత్రం ఎగ్జిట్ ఫలితాలు విడుదల*

*జూన్ 4న ఇంతవరకు 7 విడతల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు*

నాలుగో విడతలోనే అత్యధిక పోలింగ్ జరిగిందని, ఇప్పటివరకు జరిగిన ఆరు విడతల ఎన్నికల్లో నాలుగో విడతలోనే అత్యధికంగా 69.16 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. అత్యల్పంగా ఐదో విడతలో 62.20 శాతం ఓటింగ్ జరిగినట్లు పేర్కొంది.

మొత్తం 543 లోక్సభ స్థానాల కు గానూ ఇప్పటివరకు 486 స్థానాలకు పోలింగ్ జరగగా, మిగిలిన 57 స్థానాలకు జూన్ 1న ఎన్నికలు జరగనుంది. 

తెలుగు రాష్ట్రాల్లో నాలుగో విడతలో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: