🛕శ్రీ శ్రీ శ్రీ రాజ్య లక్ష్మి దేవి అమ్మవారి వార్షికోత్సవ మహోత్సవములు 🛕కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడసకుర్రులో కొలువు తీరి యున్న అమ్మవారు శ్రీ శ్రీ శ్రీ రాజ్య లక్ష్మి దేవి అమ్మవారి వార్షికోత్సవ మహోత్సవాలు ఆదివారం నాడు వైభవం గా ప్రారంభమయ్యాయి. శ్రీ శ్రీ శ్రీరాజ్యలక్ష్మి దేవి అమ్మవారిని శ్రీ శ్రీశ్రీ రాజేశ్వరి దేవి గా, రాజమ్మ గా కొలుస్తారు. అమ్మవారి పుట్టినింటి వారు అయ్యగారి వంశీయులు. ఆదివారంజాతర సందర్భంగా ఆలయం వద్దఉదయం 6గంటలనుండి సోమవారం ఉదయం 6గంటల వరకు ఏకా హం (భజన )ఏర్పాటు చేసారు. అమ్మవారి ప్రతి రూపమైన గరగ గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. సోమవారం ఆలయం వద్ద అన్న సమారాధన ఏర్పాటు చేసారు. ఆలయ నిర్వాహకులు మొయిల గణపతి రావు ఆధ్వర్యములో జరిగిన ఈ మహోత్సవాల్లో భజనగురువు కలిగినీడి సత్యనారాయణ, తో పాటు పలువురు ఫాల్గొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: