🔹కేబీఆర్ నాయుడు కు 
మాతృ వియోగం 🔹

అమలాపురం: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఇండియన్ టొబాకో డెవలప్ మెంట్ బోర్డు మాజీ ఛైర్మన్ కొర్లపాటి బ్రహ్మానందరావు నాయుడుమాతృమూర్తి కొర్లపాటి సావిత్రి (90) వృద్దాప్యం కారణంగా ఆదివారం రాత్రి అమలాపురంలోని  స్వగృహంలో కన్నుమూశారు.
ఆమెకు ముగ్గురు కుమారులు,  ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
నాయుడు మాతృమూర్తి మృతి పట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంటెద్దు బాబి, పీసీసీ ఉపాధ్యక్షుడు ముషిణి రామకృష్ణారావు, అమలాపురం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి అయితాబత్తుల సుభాషిణి, ఏఐసిసి సభ్యుడు యార్లగడ్డ రవీంద్ర, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ ఛైర్మన్ కుడుపూడి శ్రీనివాస్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గంటి ప్రవీణ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఛైర్మన్ వడ్డి నాగేశ్వర రావు, రాష్ట్ర కాంగ్రెస్ ఒబీసి కన్వీనర్ బీజెడబ్లు రెడ్డి బాబు, అమలాపురం రూరల్ మండల అధ్యక్షుడు రాయుడు వెంకటరమణ తదితరులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సావిత్రి భౌతికకాయంపై పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: