✅ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేసాం :జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ✅ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని రాజకీయ పార్టీల అభ్యర్థులు వారి తరుపు ఏజెంట్లు ఈ లెక్కింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో నిర్వహించడం లో తమ వంతు సహాయ సహకా రాలు అందించాలని జిల్లా కలెక్టర్ జిల్లాఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా కోరారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహణ తీరు పట్ల ఆయన అవగాహన కల్పించారు. ఓట్ల లెక్కింపు నకు సంబంధించి కౌంటింగ్ సూపర్ వైజర్లు, కౌంటింగ్ ఆసిస్టెంట్ల కు, సూక్ష్మ పరిశీల కులకు శిక్షణ కార్యక్రమాలు జరుగుతు న్నాయన్నారు. జూన్ నాలుగో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవు తుందని. ఓట్ల లెక్కింపునకు సంబంధించి కౌంటింగ్ హాల్లో ప్రతి నియోజకవర్గానికి టేబుళ్లు ఏర్పాటు చేసామన్నారు. పోస్టల్ బ్యాలెట్ల, సర్వీస్ ఓటర్ల లెక్కింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టి ప్రతి నియోజకవ ర్గానికి పోస్టల్ బ్యాలెట్ కొరకు ఒక టేబుల్ సర్వీస్ ఓటర్ల కొరకు మరొక టేబుల్ వెరసి రెండు టేబుళ్ళు కేటాయించి మూడు రౌండ్లలో సుమారుగా 18,000 ఓట్లు లెక్కించ నున్నట్లు తెలిపారు..జిల్లాలో 1644 పోలింగ్ కేంద్రాలలో జిల్లావ్యాప్తంగా ఉన్న 15,31,410 మంది ఓటర్లలో 12,84,008 మంది తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారని ఆయన తెలిపారు ఈ ఏడు నియోజక వర్గాల ఓట్ల లెక్కింపు కోసం 88 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గానికి 82 టేబు ళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. రామచంద్ర పురం అసెంబ్లీ నియోజ కవర్గంలో 24 రౌండ్లలో , ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో 19 రౌండ్లలో, అమలాపురం అసెంబ్లీ నియోజక వర్గంలో 20 రౌండ్లలో, రాజోలు అసెంబ్లీ నియోజ కవర్గంలో 15 రౌండ్లలో, పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో 18 రౌండ్లలో, కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గంలో 26 రౌండ్లలో, మండపేట అసెంబ్లీ నియోజ కవర్గంలో 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తికానున్నదన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు, ప్రధాన ఎన్నికల ఏజెంట్లు, లెక్కింపు సిబ్బందికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశామని లెక్కింపు ఏజెంట్ల కొరకు మాత్రం వేరే మార్గాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓటర్లు లెక్కింపు పర్యవేక్షణకు సహాయ రిటర్నింగ్ అధికారులుగా ఉన్న తాసిల్దార్లు వారి పరిధి లోని డిప్యూటీ తాసిల్దారులను నియమించామన్నారు. లెక్కింపు ప్రక్రియ గోప్యతను కాపాడుతూ ఎటువంటి అపోహ లకు తావు లేకుండా స్పష్టత తో లెక్కింపు ప్రక్రియ అత్యంత పారదర్శ కంగా జవాబుదారీతనంతో సీసీ కెమెరాలు చిత్రీకరణ పర్యవేక్షణలో చేపట్టడం జరుగుతుందని ఆయ న స్పష్టం చేశారు. కౌంటింగ్లో అవకతవకలకు తావు లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టామని కౌంటింగ్ కేంద్రాల వద్ద కౌంటింగ్ సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు చేశామని. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన శాంతి భద్రతల పరిరక్షణకై పటిష్ట బందోభస్తును ఏర్పాటు చేశామన్నారు. ప్రతి రౌండ్ పూర్తి కాగానే ఫలితాలను వెల్లడించేలా ఏర్పాటు చేసామన్నారు. ఈ కార్యక్ర మంలో డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు సూపరింటెండెంట్ టీ వైద్యనాథ శర్మ, భారతీయ జనతా పార్టీ తరఫున దూరి రాజేష్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున వడ్డీ నాగేశ్వరరావు బహుజన సమాజ్ పార్టీ తరఫున కేఎస్ఎల్ భవాని సిపిఐ తరుపున కారెం వెంకటేశ్వరరావు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పి పవన్ సూర్య తదితరులు పాల్గొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: