శ్రీ నరసింహ జయంతి (మల్లెల తెలుగుతేజం వార్త :జి ఎన్ రావు :కోనసీమ జిల్లా )కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడస కుర్రు గ్రామంలో శ్రీ నరసింహ జయంతి (డబ్బాల రాముడు )ఘనంగా నిర్వహించారు.1960-63మధ్య శ్రీ నరసింహ జయంతిని (డబ్బాల రాముడు జయంతి) గా జరిపే వారు. సుద్దపల్లి సూర్యనారాయణ (అబ్బాయి)ఆధ్వర్యంలో జరిగేది. వైశాఖ బహుళ త్రయోదశి నుండి 5రోజులు జరిపే వారు. ఇలా 2006వరకు జరిగింది. మరల మే -2024లో మరల ప్రారంభించి 5రోజులు పాటు నిర్వహించారు.ఐతే నిర్వహకులుకు సంబంధించిన కుటుంబాలు వారు వేరే వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు వారి గృహల్లో "డబ్బాల రాముడు జయంతి" జరుపు కుంటున్నారు. ఇలా చేస్తే తమ కుటుంబాలు ఉన్నత స్థితిలో ఉండి, శుభకార్యాలు జరుగుతున్నాయని తెలిపారు. ఐతే కొబ్బరి డొక్కలో కొబ్బరి ఆకులతో మందిరం ఏర్పాటు చేసి స్వామి వారిని అలంకరించి ఇంటింటికి వెళితే వచ్చిన బియ్యం తో పులి హోరప్రసాదం చేసి పంచి పెట్టె వారు. అప్పట్లో బజాలు లేక పౌడర్, నూనె డబ్బాలు మీద మోగించడం వలన డబ్బాలరాముడు అనే పేరు వచ్చింది.చుండూరి సూరిబాబు, చుండూరి గణేష్, వడ్లమాని రమేష్, విస్సా పవన్ కుమార్ శర్మ, కాశీభట్లవ్యాఘ్రీ కుమార్
ఆధ్వర్యంలో జరిగాయి.
Post A Comment:
0 comments: