⭕జర్నలిస్టుల హక్కుల సాధనకు జర్నలిస్టులు సమాయత్తం కావాలి:ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు.⭕
జర్నలిస్టుల హక్కుల సాధనకు జర్నలిస్టులు సమాయత్తం కావాలిఅని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులుఅన్నారు.

 జర్నలిస్టుల ఉనికి ప్రమాదంలో పడిందనీ, వృత్తి పరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నందున జర్నలిస్టులు సమాయత్తమై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు పిలుపునిచ్చారు.  అమలాపురం నియోజకవర్గ మహాసభ అమలాపురం ప్రెస్ క్లబ్ భవన్ లో జరిగింది. ఈ మహా సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆంజనేయులు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇవ్వాల్సిన రాయితీలను కల్పించే విషయంలో రాష్ట్ర  ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు. జర్నలిస్టుల హక్కుల అయిన అక్రిడేషన్లు ఇవ్వడంలో అనేక అడ్డంకులను సృష్టించడం దారుణమన్నారు. అలాగే జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే విషయంలోనూ ప్రభుత్వాలు తాత్సారం చేస్తూ జర్నలిస్టులను మోసగిస్తున్నాయి తప్ప ఇళ్ళ స్థలాలు ఇవ్వడం లేదన్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తమ యూనియన్ మాత్రమే ఉద్యమించి ఉందని గుర్తు చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవీన్ రాజ్ మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సంక్షేమం అందించే విషయంలో  మంచి కృషి జరుగుతుందని, జర్నలిస్టులు మృతి చెందినా, అనారోగ్యానికి గురైనా, ప్రమాదానికి గురైనా ఆర్థిక సాయం అందిస్తున్న యూనియన్ ఫెడరేషన్ మాత్రమేనని అన్నారు. పది లక్షల కార్పస్ ఫండ్ నుండి వస్తున్న వడ్డీని జర్నలిస్టుల సంక్షేమం కోసం వినియోగిస్తున్నామని ఆయన చెప్పారు‌ ఇంకా ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి ఎం. శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ హరి, ఎపిబిజెఎ జిల్లా అధ్యక్షుడు బంగార్రాజు, ఫెడరేషన్ నాయకులు ముక్కామల చక్రధర్, రెడ్డి బాబు, బషీర్, సూరిబాబు, పి వెంకటేశ్వరరావుతదితరులు పాల్గొన్నారు.

✍️ఏకగ్రీవంగా నూతన కమిటీ ఎన్నిక..✍️

యూనియన్ అమలాపురం నియోజకవర్గ నూతన అధ్యక్షులుగా కడలి పల్లప రాజు, ఉపాధ్యక్షులుగా ఆకుల సురేష్, ప్రధాన కార్యదర్శిగా కడలి సూరిబాబు,  కోశాధికారిగా పెయ్యల వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శిగా జి.కుమార్, కార్యవర్గ సభ్యులుగా ఊటాల చిరంజీవి, కామన శ్రీనివాస్, మట్టపర్తి త్రిమూర్తులు,మోత వెంకటేశ్వరరావు, మామిడిశెట్టి విష్ణు ప్రసాద్, చింతపల్లి జాన్ రత్నం, రెడ్డి శ్రీనివాస్, పరమట భీమా మహేష్ ఎన్నికయ్యారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: