⭕ఆహ్లాదంలో సెల్ఫీలు....పొంచి ఉన్న ప్రమాదం.⭕
కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం బోడసకుర్రు గ్రామంలో టిడ్కో గృహల వద్ద ఆహ్లాదం వెనుక ప్రమాదం పొంచివుంది. టి డ్కో గృహలలో నివసిస్తున్న ప్రజలు ఆహ్లాదకర మైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు టిడ్కో భవన సముదాయం పైన 3వ అంతస్తుపైన ఉన్న వాటర్ ట్యాంక్ పైకి వెళ్లి సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఒకే వారంలో రెండు వేరు వేరు బ్లాక్ లో సెల్ఫీ లు తీసుకుంటున్న సంఘటనలు వెలుగు లోకి వచ్చాయి.వరుస సంఘటనలు వెలుగు లోకి రావడం తో ఇక్కడ ఇంచార్జులు హెచ్చరించారు. ఇటువంటి సంఘటనలు జరిగితే రూ.2000/(రెండు వేలు )అపరాధ రుసుము వసూలు చేస్తాము అని తెలిపారు.ఇక్కడ గృహా సముదాయాలకుఒక కమిటీ, ఒక్కొక భవనానికి ఇద్దరు ఇంచార్జ్లు వున్నారు.వారు నామ మాత్రమే అన్నట్టు వున్నారు.పురపాలకసంఘము తరపున ఉన్న ఇంచార్జ్ ఉదయం 10గంటలనుండి సాయంత్రం 5గంటలకవరకు ఆఫీస్ లో ఉండి సమస్యలు ఉంటే పరిష్కరిస్తారు. ఐతే అల్లవరం మండలం బోడసకుర్రు -దేవర్లంకలో ఉన్న ఈ సముదాయం అమలా పురం పురపాలక సంఘము పర్యవేక్షణలో వుంది. పురపాలక కమిషనరు వీటి పై ప్రత్యేక దృష్టిపెట్టాలి.గృహ లబ్ది దారులకు అవగహనకల్పించాల్సిన అవసరం వుంది.
Post A Comment:
0 comments: