ఆరణి జోలి కోస్తే....ఊరుకోం:
- ఆర్కాట్ కృష్ణప్రసాద్
- రాష్ట్ర అధ్యక్షులు
- బలిజసేన
ఈ రోజు ఉదయం 11 గంటలకు తిరుపతి ప్రెస్ క్లబ్ నందు బలిజసేన రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు భద్రత పెంచారని చెప్పారు.
పోలింగ్ రోజు, తరువాత జరిగిన హింసాత్మక ఘటనలతో భద్రత పెంపుకు ఈసిని ఆరణి శ్రీనివాసులు కోరగా హైకోర్టు సూచనలతో పోలీసులు భద్రత పెంచారని ఆయన తెలిపారు. ఆరణి భద్రత పెంపుకు గతంలో ప్రస్తుత తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వైఖరే కారణమన్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షులు చిరంజీవి తిరుపతిలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో పోలింగ్ రోజు భూమన కరుణాకర్ రెడ్డి చేసిన దౌర్జన్యం ఇంకా ఎవరు మరిచిపోలేదన్నారు.గతంలో వైఎస్ కుటుంబీకులు తిరుపతిలో దివంగత మాజీ ఎమ్మెల్యే వెంకటరమణని కిడ్నాప్ చేసి దౌర్జన్యం చేస్తే ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించిన విషయం అందరికీ తెలుసని ఆయన చెప్పారు .
అదేవిధంగా 2014 ఎన్నికల పోలింగ్ సందర్భంగా జీవకోనలో వెంకటరమణ ను కొట్టి చొక్కాయి చింపిన చరిత్ర భూమన కరుణాకర్ రెడ్డి దని ఆయన తెలిపారు. 2019లో రాష్ట్రమంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలి వీచినా తిరుపతిలో టిడిపి తరుపున పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధిక్యంలో ఉన్నప్పటికి బెదిరింపులుకుదిగి ఫలితాన్ని తారుమారు చేసిన ఘనత కరుణాకర్ రెడ్డి దని ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ వివరించారు.కాగా గ్రేటర్ రాయలసీమ జిల్లాల్లో గత ఎన్నికల్లో గెలిచిన ఏకైక బలిజ ఎమ్మెల్యే అయిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను ఐదేళ్ళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అడుగడుగునా అవమానపరిచి అనగదొక్కి నామ మాత్రపు ఎమ్మెల్యేగా చేసిన చరిత్ర వారిదని ఆయన దుయ్యబట్టారు. జనసేన తరుపున గ్రేటర్ రాయలసీమ పరిధిలో పోటీ చేసిన ఏకైక బలిజ నాయకుడు ఆరణి శ్రీనివాసులను దెబ్బ తీయడానికి రకరకాల కుట్రలు, కుతంత్రాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతులు చేస్తున్నారని అవి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వమని ఆయన హెచ్చరించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాక రాయలసీమ జిల్లాల్లోనే గుర్తింపు పొందిన సీనియర్ నాయకుడుగా ఉండి వివిధ వర్గాల్లో ఆరణి శ్రీనివాసులకు గల ఆదరణ చూసి ఓర్వలేక భూమన కుటుంభం లేనిపోని కుట్రలకు తెరలేపింది. ఇందులో భాగంగా సోషల్ మీడియాను వేదికగా చేసుకుని లేనిపోని ఆరోపణలు చేస్తూ రెచ్చగొట్టే పనుల చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఐదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో బాధితులందరూ బలిజ కులస్థులేనని అన్నారు. ఆరణి శ్రీనివాసులకు ఏదైనా హని తలపెడితే గ్రేటర్ రాయలసీమ పరిధిలోని కాపు, బలిజ లంతా ఏకమై అడ్డుకుంటామని హెచ్చరించారు.
Post A Comment:
0 comments: