41 A నోటీసును పోలీసులు ఎప్పుడివ్వాలి
✅ 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసుల్లో FIR నమోదు చేసిన వెంటనే ప్రాధమిక ఆధారాలు సేకరించడానికి ఆ కేసులోని నిందితులకు CRPC సెక్షన్ 41-A ప్రకారం నోటీసు ఇవ్వాలి.
✅ 41-A FIR నమోదు అయిన 15 రోజుల్లో ఇవ్వాలి ఏ కారణం చేతైనైనా 15 రోజుల్లో ఇవ్వలేకపోతే, SP గారి అనుమతి తో 30 రోజుల్లో ఇవ్వవొచ్చును.
✅ 41-A నోటీసు అందుకున్న 3 రోజుల్లో విచారణ నిమిత్తం SHO వద్ద నిందితులు హాజరవ్వాలి. ఆ విచారణలో మీ జోక్యం లేదనే ఆధారాలు ఉంటే FIR లో మీ పేరును తొలగించాలి.
✅ 41- A నోటీసు అందుకున్న వారు, తనను రేమాండకు పంపే అవకాశం ఉందని భావిస్తే ముందస్తు
*బెయిల్ (ANICIPATORY BAIL) కు అప్లికేషన్ పెట్టుకో వచ్చును.
✅ సెక్షన్ 41 లోని సబ్-సెక్షన్ 1 లో ఉన్న క్లాజెస్ లోని చర్యలకు నిందితులు పాల్పడే అవకాశం ఉందని SHO భావిస్తే ఏఏ చర్యలకు వారు పాల్పడే అవకాశం ఉందనేది రిమాండ్ రిపోర్టులో వ్రాయాలి కోర్టువారు ఆ కారణాలు సహేతుకమైనవేనని భావిస్తే నే నిందితులను రిమాండుకు పంపాలి లేకుంటే వదిలేయాలి.
✅ నిందితుడు తనను నిందితుడని చెప్పడానికి ఆధారాలు లేనప్పుడు 41-A నోటీసును తీసుకోవాల్సిన అవసరం లేదు సరైన కారణాలు లేకుండా అలాగే కోర్టు ఆదేశాలు లేకుండా అరెస్టు చేసే అధికారం పోలిసులకు లేదు.
Post A Comment:
0 comments: