*జగ్గంపేట చరిత్రలో కనీ విని ఎరగని విజయాన్ని అందుకున్న జ్యోతుల నెహ్రూ*


*జగ్గంపేట శాసనసభ్యుడిగా 52775 ఓట్ల మెజార్టీతో ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ గెలుపు*


కాకినాడ జిల్లా జగ్గంపేట జూన్ 4: జగ్గంపేట నియోజకవర్గం టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ జగ్గంపేట శాసనసభ్యుడిగా 52775 ఓట్ల మెజార్టీతో చరిత్రలో కని విని ఎరగని మెజార్టీతో గెలుపొందారు. జగ్గంపేట నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇంతటి భారీ మెజార్టీతో గెలుపొందిన ఏకైక వ్యక్తి జ్యోతుల నెహ్రూ, 113593 ఓట్లు జ్యోతుల నెహ్రూకు ఓట్లు పోలు అయ్యాయి తన సమీప ప్రత్యర్థి వైసిపి అభ్యర్థితోట నరసింహం కు 60 917 ఓట్లు పోలవగా, ఇండిపెండెంట్ అభ్యర్థి పాఠం శెట్టి సూర్యచంద్రకు12531 ఓట్లు పోలయ్యాయి జగ్గంపేట చేరుకున్న జ్యోతుల నెహ్రూకు టిడిపి జనసేన బిజెపి నాయకులు పుర ప్రముఖులు పలువురు భారీ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: