అమరావతి విజయవాడ:- 08-06-2024                           కారణజన్ముడు  కామ్రేడ్ చెరుకూరి రామోజీరావు లేని లోటు యావత్ భారతదేశానికి తీరనిది -  అంబాసిడర్ డాll ఆకుల సతీష్ -  మా  స్వస్థలానికి అతి సమీపంలోని గుడివాడ  మండలం పెదకూరపాడు గ్రామంలో అతి చిన్న సన్నకారు రైతు  వెంకటసుబ్బయ్య వెంకట సుబ్బమ్మలకు జన్మించిన  కామ్రేడ్ పద్మవిభూషణ్ డాll చెరుకూరి రామోజీరావు చిన్న వయసు నుండి అపర మేధావి  అసమాన్య ప్రతిభాశాలి అని సాహిత్యంలో ఏం ఏ  చదివిన కామ్రేడ్ రామోజీరావు విశాఖపట్నం వెళ్లి చిన్న పత్రికలో విలేకరిగా యాడ్స్ మేనేజర్ గా జీవితం ప్రారంభించి బ్రతకటానికి డబ్బు సరిపోక  సైకిల్పై ఊరగాయలు పొడులు వడియాలు అప్పడాలు అమ్ముతూ  వచ్చిన డబ్బుతో రైతన్నల కోసం సొంతంగా  అన్నదాత అనే పత్రికను ప్రారంభించి అంచలంచలుగా మార్గదర్శి ఫైనాన్స్ చిట్స్ ప్రియా ఫుడ్స్ ఈనాడు సంస్థలు  ఉషా కిరణ్  మూవీస్ మయూరి డిస్ట్రిబ్యూషన్ ఫిలిం సిటీ ఎఫ్ఎం రేడియో వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలను  స్థాపించి  మర్రి చెన్నారెడ్డి ఎన్టీఆర్ వంటి ఎందరో రాజకీయ దిగజాలకు రాజకీయ జీవితాన్ని ఉదయ్ కిరణ్ వంటి  ఎందరో వర్ధమానటులకు సినీ జీవితాన్నిచ్చి సృష్టికి ప్రతి సృష్టిని చేసిన విశ్వామిత్రుని వలే భగీరథుని వలె అంచలంచెలుగా ఎదిగి దేశానికి గొప్ప దర్శనికుడిగా నిలిచారని తెలుగుజాతి ఉన్నంతకాలం చెరుకూరి రామోజీరావు ఘన కీర్తి ఉదయించే సూర్యుని వలె నిలిచి ఉంటుందని  ఆయన అంతర్జాతీయ విజయాలను చూసి తట్టుకోలేకపోయిన ఏడుగురి సందింటి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మార్గదర్శిని పడగొట్టటానికి చేసిన రాక్షస ప్రయత్నాలు ఫలించలేదని తిరిగి దశాబ్దం తర్వాత జగన్ మార్గదర్శిని పడగొట్టడానికి ముఖ్యమంత్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని  ప్రభుత్వ పరంగా ఎన్నో వేధింపులకు గురిచేసి ఘోరంగా విఫలమయ్యాడని ఎవరు ఎన్ని చేసినా రామోజీని  తాక లేకపోవటం ఆయనలోని పట్టుదల ఆత్మవిశ్వాసం నిబద్ధత నిరాడంబర జీవితం స్వయంకృషి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న దృడ సంకల్పం క్రమశిక్షణ నీతి నిజాయితీ మూల కారణమని  మానవుడే మహనీయుడు కృషితో నాస్తి దుర్భిక్షం అనే పదాలకు అర్థం రామోజీరావు అని ఆయన జీవిత చరిత్రను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లల పాఠ్యపుస్తకాలలో ముద్రించి ఆయనకు నిజమైన నివాళి ఇవ్వాలని  ఆయన జీవితం నేటి యువతకు అత్యంత ఆదర్శప్రాయమని  ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు అంబాసిడర్ డాll ఆకుల సతీష్
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: