ప్రపంచంలో కెల్లా అతిభారీ కుంభకోణం EVM కుంభకోణమే: ఆబాద్ పార్టీ వ్యవస్థాపక అద్యక్షుడు హాసన్. షేక్
===================
ప్రపంచ ప్రజాస్వామిక చరిత్రలో నేటివరకు జరిగిన అన్ని రకాల కుంభకోణం, భారీ మోసం, పెద్ద దగా (Scam)లో కెల్లా.. మన భారతదేశంలో కొన్ని సంవత్సరాలుగా  జరిగిన ఎన్నికల అక్రమాలు, EVM అవకతవకలకు సంబంధించిన కుంభకోణమే.. అతిపెద్ద భారీ కుంభకోణంగా ప్రపంచ వ్యాప్తంగా వుంటున్న ప్రజలు, ప్రజాస్వామిక వాదులు నమ్ముతున్నట్లు, విశ్వసిస్తున్నట్లు, అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది.
ఈ కుంభకోణాన్ని మాటలతో వర్ణించలేమని.. వేటితో  పోల్చలేం,  విలువ కూడా కట్టలేని పరిస్థితి. 
ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగనిరీతిలో ఎప్పుడూ, ఎక్కడా చూడని, వినని, జరగని విధంగా ఇది జరగడం.. అత్యంత ఘోరం, దారుణం, దుర్మార్గం. అంతేకాదు.. హీనం, హేయం, నీచo, నికృష్టం. వర్ణించడానికి తెలుగు పదాలు  లేనేలేవని తెలుస్తోంది.
నిజంగా.. ఈ దొంగలకు, దోపిడిదారులకు, అవినీతి, లంచగొండిదారులకు, సంఘవ్యతిరేక, విద్రోహశక్తులకు.సిగ్గూ, శరం, మానం, రోషం అన్నవి ఉంటే..  ఈ అనైతిక , అనాగరిక, అప్రజాస్వామిక చ్చర్యలకు,  పాల్పడరు. 
అయినా, మనదేశంలో పవిత్ర ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు, విచ్ఛిన్నం చేసేందుకు, విఘాతం కలిగించేందుకు, సర్వనాశనంచేసేందుకు నిస్సిగ్గుగా ఏమాత్రం వెనకాడని పరిస్థితి.
వీళ్ళది నీతి, జాతి వున్నోల్లేనా.. విలువలు, ఆదర్శాలు కలిగినొల్లేనా.. వీళ్లది ఒక బ్రతుకేనా? ఎన్నో త్యాగాలు, పోరాటాలు, ఆత్మబలిదానాలుతో సాధించుకున్న, నిర్మించుకున్న ఈ ప్రజాస్వామ్యాన్ని.. నిట్టనిలువునా కుప్పకూల్చేందుకే మొగ్గు చూపుతున్నారు అంటే.. ఈ భూభాగంలోని గాలి, నీరు, స్వేచ్ఛతో సహా పంచభూతలు అనుభవించేదానికి అర్హులెనా? 
ప్రపంచంలో ఎక్కడో దేశంకాని దేశం అవతలఉన్న, రాజకీయాలతో పెద్దగా సంబంధంలేని టెస్లా అధినేత, వ్యాపార దిగ్గజం ఎలాన్ మాస్క్ సహా ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది వివిధ రంగాల, వర్గాల ప్రముఖులు EVM లను రద్దుచేయాలి అని స్పందిస్తున్నారు గానీ.. మన దేశంలోనే వుంటూ, రాజకీయాలతో నేరుగా సంబంధం కలిగి,130 సంవత్సరాల పైబడి చరిత్ర కలిగి, మూడు దఫాలుగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తూ.. EVM ల ప్రభావాన్ని, నష్టాన్ని.. ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుభవించిన, భారత జాతీయ కాంగ్రెస్ (INC) గానీ.. దాని ఆధినాయకత్వం గానీ.. ఇంతవరకు స్పందించనేలేదు, ఖoడించనేలేదు, రద్దుచేయమని అడగనేలేదు. రద్దుకొరకు ఉద్యమం, పోరాటం చేయడంలేదు. అంతేకాదు.. ప్రజాస్వామ్య యుద్ధానికి పూనుకోవడమేలేదు. దీనిని బట్టి, ప్రజలు ఏమనుకోవాలి? పోనీ, EVM లు సమర్థనీయమేనని అయినా, ప్రకటన చేయండి అంటే.. అదీచేయరు. 
EVM ల వాడకం, పనితీరుపై ఇంటా, బయట ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్దఎత్తున వ్యతిరేకత వస్తూవుంటే.. ఎక్కడచూసినా విపరీతమైన చర్చ జరుగుతోంటే.. బాధ్యతలేదూ అన్నట్లు మౌనంగా వుండటాన్ని ఏమనాలి, ఎలా అర్థం చేసుకోవాలి?.
ఎందుకింత అశ్రద్ధ, అలసత్వం, నిర్లక్ష్యం,నియంతృత్వం, నిరంకుశత్వం? అవగాహణలేని తనమా, పిరికితనమా, భయమా? ప్రజలు ఏమనుకోవాలి. 
ఇప్పటికైనా.. కాంగ్రస్ పార్టీ EVM లపై వెంటనే నోరు విప్పాలి, ప్రజలపక్షాన నిలబడాలి. లేదంటే, ఈ విషయంలో మిమ్మలను అనగా కాంగ్రెస్ పార్టీని కూడా దోషిగా, అవకాశవాదులుగా  భావించే అవకాశం అధికంగా ఉందని తెలియజేస్తూ.. అటువంటి వాటికి ఎంతమాత్రం తావివ్వరాదని ఈ సందర్భంగా బాధ్యతగల భారత పౌరుడిగా ఆబాద్ పార్టీ వ్యవస్థాపక అద్యక్షునిగా నిర్మాణాత్మకమైన సూచన చేస్తున్న వినయంగా, వినమ్రంగా, 
 EVM వ్యతిరేక జాతీయ ఉద్యమంలో భాగస్వాములమవుదాం.. అడ్డదారుల్లో, అక్రమపద్ధతుల్లో, తప్పుడుమార్గంలో గెలవాడన్ని కలిసికట్టుగా అడ్డుకుందాం.. ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచే విధానానికి మార్గం సుగమం చేద్దాం.. తద్వారా భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని కాపాడుకుందాం, పరిరక్షించుకుందాం...
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: