రాజధాని అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి.
మొన్నటివరకు రాత్రిళ్లు చీకటిమయంగా ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డు నేడు విద్యుత్తు వెలుగులతో కళకళలాడుతోంది.
మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం నుంచి రాయపూడి వరకు ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డు 8 కిలోమీటర్ల మేర విద్యుత్తు స్తంభాల పునరుద్ధరణ పనులను అధికారులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. సోమవారం రాత్రి ఈరహదారిపై విద్యుత్తు దీపాల వెలుగులుకనులవిందు చేశాయి. అమరావతికి పట్టిన గ్రహణం వీడిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Post A Comment:
0 comments: