కాకినాడ జిల్లా జగ్గంపేట జూన్ 7 :జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు ను ఘనంగా సత్కరించిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ శ్రేణులు రామవరం గ్రామంలో తెలుగుదేశానికి మెజార్టీ తీసుకొచ్చి చరిత్ర సృష్టించిన వెంకటేశ్వరరావుని పలువురు ప్రశంసలతో ముంచెత్తి జ్ఞాపిక అందించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఏడుసార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ ఒక్కసారి కూడా ఒక్క ఓటు మెజార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు రాలేదని ఈరోజు సమర్థత సత్తా ఉన్న నాయకుడు జ్యోతుల నెహ్రూ అవసరం ఈ నియోజకవర్గ ప్రజలకు ఉందని గ్రహించి ప్రతి గ్రామంలోను మెజార్టీ ఇచ్చారని వీరవరంలో కూడా మెజార్టీ వచ్చిన ఘనత నెహ్రూకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండ పాక పాపారావు, మండపాక సూర్యనారాయణ, మణికంఠ వెంకటేశులు, అడబాల సూరిబాబు, మరు కుర్తి గంగాధర్, మండపాక బ్రహ్మాజీ, ఒంటిపిల్లి పెద్దకాపు, కాపువరపు గంగాధర్, వంటిపల్లి బాబ్జి, మండపాక సుబ్రహ్మణ్యం, అడబాల పెదబాబు, మొగిలి గంగాధర్, ఎంపీటీసీ సభ్యులు దొడ్డ శ్రీను,గుర్రాల వెంకటరమణ, చనిపోయిన నూకరాజు, గుర్రం వీరబాబు దొండ్రుతిరుపతిరావు,
అడబాల సత్యనారాయణ, నీలం నాగులు, మండపాక పెద్ద, బొల్లి నాగేశ్వరరావు, మాగంటి ఏసు అధిక సంఖ్యలో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: