"


ఓట్ల లెక్కింపు కు సర్వం సన్నద్ధం: కోనసీమ 
జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా

ఈనెల 4వ తేదీన  ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చెయ్యేరు శ్రీనివాస్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతుందని, ఈ మేరకు జిల్లా యంత్రాంగం తరఫున శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రాల్లో పటిష్టఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. శనివారం ముమ్మిడివరం నియోజక వర్గం కాట్రేనికోన మండలం చేయ్యేరు గ్రామంలోని శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో ఏడు అసెంబ్లీ నియోజ కవర్గాలు మరియు పార్లమెంట్ సెగ్మెంట్ కు సంబంధించి ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఏర్పాట్లు ఆయన జిల్లా యంత్రాంగంతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శ కాలకు అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై అధికారులు, సిబ్బంది. పూర్తిస్థాయి అవగాహన తో ప్రక్రియ నిర్వహిం చాలన్నారు  పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రతి దశలో అనుసరించాల్సిన విధివి ధానాలపై ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా లెక్కింపు సజావుగా సాగేందుకు కౌంటింగ్ కేంద్రాల్లో ప్రత్యే కంగా ఏర్పాట్లు చేశామని తెలిపా రు.. రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపులో వేగంతో పాటు ఖచ్చితత్వం అత్యం త ప్రధానమన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో కౌంటింగ్ సూపర్వైజ ర్,కౌంటింగ్ అసిస్టెంట్లు, సూక్ష్మ పరిశీలకులు  ఉంటారన్నారు. ఒక్కో టేబుల్కు కేటాయించిన అధికారుల బృందం పూర్తిస్థాయిలో సమన్వ యంతో పనిచేయాలన్నారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అందరూ శాంతియుతంగా వ్యవహరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రత లకు విఘాతం కలిగించేలా వ్యవ హరించరాదని సంయమనం పాటిం చాలని సూచించారు  పార్లమెంటు, శాసన సభకు జరిగిన సాధారణ ఎన్నికలు -2024 నేపథ్యంలో ఈనెల 4వ తేదీన లెక్కింపు ప్రక్రియను స్వేచ్ఛా యుతంగా నిర్వహించేం దుకు, సంఘ విద్రోహ శక్తుల జోక్యాన్ని అరికట్టడానికి, శాంతి భద్రతలను కాపాడేందుకు అనుగుణంగా జిల్లాలో 144 సెక్షన్ విధించినట్లు  పేర్కొన్నారు. కౌంటింగ్ నేపథ్యంలో మద్యం,బాణాసంచా మందు గుండు సామాగ్రిని విక్రయిం చరాదన్నారు కౌంటింగ్ ప్రాంగణానికి సమీపంలో ప్రభుత్వ విధులు నిర్వ హించే అధీకృత సిబ్బంది మినహా ఇతరులెవరూ ఉండడానికి వీలు లేదన్నారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన పూర్తయ్యే వరకు కౌంటింగ్ కేంద్రం ఆవరణలో ఎలాంటి విజయో త్సవ ర్యాలీలు ఊరేగిం పులు  చేయడానికి, సంబరాలకు గానీ అవకాశం లేదన్నారు. ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్, పోస్టల్ ఓటింగ్ సెంటర్, హోం ఓటింగ్ పోస్టల్ బ్యాలెట్లు, ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్ మిటెడ్ పోస్టల్ బ్యాలెట్, సిస్టమ్ ద్వారా వచ్చిన సర్వీస్ ఓట్లు, లెక్కింపును అత్యంత పారద ర్శకంగా నిర్వహించాలన్నారు. రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపులో వేగంతో పాటు కచ్చితత్వం అత్యంత ప్రధా నమన్నారు..ఒక్కో టేబుల్కు కేటా యించిన అధికారుల బృందం పూర్తిస్థాయిలో సమన్వయంతో పనిచేయాలన్నారు. ఫారం-13సీ, ఫారం-13ఏ (డిక్లరేషన్), ఫారం- 13బీ స్థాయిలో తిరస్కరణ నిబంధనలు, డిక్లరేషన్లో సీరియల్ నంబరు, ఓటరు సంతకం, అటెస్టర్ సంతకం తదితరాలతో పాటు బ్యాలెట్లో మార్కింగ్, ట్యాబ్యులేషన్ తదితరాలకు సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహనతో లెక్కింపు చేపట్టాలన్నారు. కౌంటింగ్ సిబ్బంది ప్రక్రియ పూర్తయి వరకు అప్రమత్తంగా వ్యవహరించా లన్నారు. లెక్కింపు ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రంలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని లేదంటే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా, శాంతియుతంగా పూర్తి చేసేందుకు ప్రతీ ఒక్కరూ సహకరిం చాలన్నారు మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుందని అరగంట తర్వాత ఇవిఎంల లెక్కిం పు ప్రారంభమవుతుందన్నారు అన్ని టేబుళ్ల వద్ద లెక్కింపు పూర్తయి, ఆ రౌండ్ ఫలితాలను ప్రకటించిన తరువాతే తదువరి రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు  ప్రక్రియను పర్యవేక్షించడానికి అభ్యర్థులు లేదా వారి తరపు ఏజెంట్లుగా నియామక పత్రం ఉన్నవారిని మాత్రమే అనుమ తిస్తారన్నారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సిసి కెమేరాలను ఏర్పాటు చేశామన్నారు..ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉoడదని. మొబైల్ ఫోన్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ వాచ్ లు తదితర ఏవిధమైన ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరన్నారు ఏజెంట్లు పెన్ను, పెన్సిల్, 17 సి ఫారం నకలు ,తెల్ల కాగితం మాత్రమే తమతోపాటు తీసుకొని వెళ్లాల న్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక పార్లమెంట్  నియోజక వర్గానికి జరుగుతున్న కౌంటింగును పరిశీలించ డానికి నియమితులైన  సాధారణ పరిశీలకులు లెక్కింపు కేంద్రాల్లో ఉండి ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తారన్నారు  లెక్కింపు కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు, నిఘా ఏర్పాటు చేశామన్నారు.  కౌంటింగ్ కేంద్రo వద్ద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సౌకర్యార్థం మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేశామ న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, జిల్లా  రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన రిటర్నింగ్ అధికారులు సహాయ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: