⭕పొగాకు వల్ల కలిగేనష్టాలు పై ర్యాలీ ⭕కోనసీమ జిల్లా లోని అమలాపురం- కిమ్స్ దంత వైద్యకళాశాల లో ఓరల్ అండ్ మాక్సిల్లోఫేసియల్ సర్జరీ ఆధ్వర్యంలో  "ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవము" నిర్వహించారు. ఈ సందర్భముగా ప్రజలలో పొగాకు గురించి, పొగాకు వల్ల కలిగే నష్టాలు గురించి  అవగాహన  తెలియచేస్తూ ర్యాలీ చేయటం జరిగింది.  ఇందులో ఏపీ ఏ ఓ ఎమ్ ఎస్ ఐ మరియు  ఐ డి ఏ కోనసీమ వారి సౌజన్యం తో దంత కళాశాల లో పొగాకు వ్యతిరేక దినోత్సవం మీద వివిధ రకమైన పోటీలు  నిర్వహించి బహుమతులు ఇవ్వటం జరిగినది. ఇందులో కిమ్స్ చైర్మన్ కే.వి.వి.సత్యనారాయణ రాజు,ఎమ్ డి కే.రవి వర్మ, దంత వైద్యశాల ఎం.డి,శేష పవిత్ర , ప్రినిసిపాల్ కే.శివ కుమార్, డిపార్టుమెంట్ హెడ్ కే.అర్జున్ గోపినాథ్, ,ఐ డి ఏ కోనసీమ బ్రాంచ్  దంత వైద్యులు తదితరులు పాల్గున్నారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: