సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు నుండి ఎలాంటి అనుమతి లేకుండా నీటిని బయటికి వదులుతున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. గత రెండు మూడు రోజులుగా ఎల్లమ్మ చెరువు నుండి నీటిని గుంత ద్వారా బయటకు వృధాగా వదిలి వేయడాన్ని స్థానిక రైతులు అడ్డుకుంటున్నారు. వారికి మద్దతుగా నేడు ఎల్లమ్మ చెరువును సందర్శించిన అఖిలపక్ష నాయకులు నీటిని అనుమతి లేకుండా వదలడంపై నిరసన వ్యక్తం చేశారు. చెరువు సుందరీకరణ పనులు చేయిస్తున్న కాంట్రాక్టర్ ధర్మయ్య స్థానిక ముదిరాజులతో కుమ్మక్కై చెరువులో నీటిని అనుమతి లేకుండా ఆక్రమంగా బయటకు వదులుతున్నారని అఖిలపక్షం నాయకులు ఆరోపించారు. హుస్నాబాద్ పట్టణానికి తాగునీరు, సాగునీరు అందించే ప్రధానమైన వనరైన ఎల్లమ్మ చెరువు నుండి ఇరిగేషన్ అధికారుల అనుమతి లేకుండా కాంట్రాక్టర్ నీటిని బయటకు వదలడాన్ని తప్పు బట్టారు. ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్య వైఖరిని విడనాడి, వెంటనే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే స్థానిక రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం చేపల కోసం చెరువులో నీటిని వదలడం సరికాదన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: