బ్లాక్ మెయిలింగ్ చేసేపత్రికలపై కేసులు పెట్టే "బాధ్యత" బాధితులదే

చిన్న, మధ్య తరహా పత్రికలకు ప్రకటనలిచ్చి ఆడుకోవాల్సిన "భాధ్యత" ప్రభుత్వం తీసుకోవాలి.


 కొన్ని సంవత్సరాలుగా అస్థవ్యస్తంగా మారిన మీడియా రంగం, ఎక్కడో అక్కడ రోజు బ్లాక్మెయిల్ చేసినందుకు అరెస్టులు, మోటార్ వెహికల్స్ అధికార్లమని, ఇక కొందరు అయితే పోలీస్ డ్రెస్సులో కూడా హైవే లపై లారీలను ఆపి డబ్బులు గుంజుతున్నట్లు నమోదైన కేసుల్లో   జరుగుతున్న అరెస్టుల వార్తల వలన తెలుస్తోంది. వాస్తవానికి నాల్గవ ఎస్టేట్ గా గౌరవం పొందుతున్న మీడియా రంగం కొందరికి దారుణంగా దోపిడీకి అస్త్రంగా మారిపోయిందని, తీవ్రంగా అప్రతిష్ట పాలవుతోందని పలువురు సీనియర్లు ఆవేదన చెందుతున్నారు.
ఇంత అపఖ్యాతికి కారణం సోషల్ మీడియా లో ముఖ్యంగా యూ ట్యూబ్ లో వివిధ పేర్లతో చాలా తేలికగా ఒక యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టి జర్నలిస్ట్ గా చెలామణి అవటం అలాంటి వారిలో ఎక్కువ శాతం కనీస విద్యార్హత లేకుండా అసలు జర్నలిజం అంటే కనీసం అర్ధం కూడా తెలియకుండా వున్నవారు ఉన్నట్లు ఒక సంస్థ సర్వే లో తేలింది. ఇలాంటి వారే హేయమైన, నీచమైన పనులకు పాల్పడి నేరస్తులుగా నమోదవుతున్నారు.
ఇక చిన్నదైనా, పెద్దధైనా ఒక పత్రిక నడపాలంటే  రిజిస్ట్రార్ అఫ్ న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా (ఆర్ ఎన్ ఐ ) లో రిజిస్ట్రేషన్ చెయ్యాల్సి వుంది. దురదృష్టవశాత్తు ఇక్కడకూడా కనీస విద్యార్హత అవసరములేదు.దీని వలన సంక్రమించిన అవకాశంతో నిరక్షరాస్యులు అనగా అప్పటివరకు జర్నలిజమే తెలియని తాపీ పనీ,ఇంటికి సున్నాలు వేసేవారి నుండి కన్నాలు వేసేవారివరకు ఈ ముసుగులోకి వచ్చేస్తు జర్నలిజం రంగాన్ని బ్రష్టు పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి వారి పత్రికల టైటిల్స్ మాత్రం జాతీయ భావాలు, నిజాయితీ లు ఉట్టిపడేలా గొప్పపేర్లు పెట్టిచలామణి అవుతున్నారు. అవి స్వాతంత్య్రం,నిప్పులాంటి నిజం,స్వాతంత్య్రం నా జన్మహక్కు,మన బాధ్యత, పరువు ప్రతిష్ట, ఇల్లు ఇల్లాలు ఇలా తాతలు తండ్రుల పేర్లు కూడా పెట్టి  బ్లాక్ మైలర్స్ గా కొందరు చెలామణి అవుతుంటే, మరికొందరు  నిబంధనలు విడచి ఆర్ ఎన్ ఐ రిజిస్ట్రేషన్ లేకుండా అడ్డగోలుగా అడపాదడపా తాము ఎవరినైనా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజాలి అనుకున్నప్పుడు. లేదా తమకు అడ్డం వస్తున్నారని అనుకున్నా,ఎదుటివారిపై ఇష్టం లేకున్నపుడు మాత్రమే వచ్చేపత్రికలు  కొన్ని.అసలు వాటికీ ఆర్ ఎన్ ఐ నెంబర్ ఉందొ లేదో కూడా తెలియని స్థితి.అవికూడా పీడీఎఫ్ లు మాత్రమే. ఇలా రాసేవారు ముఖ్యంగా పవర్స్ అంతగా లేని, అదేమని అడగలేని రేషన్ డీలర్లు, మిల్లర్లు, ఆలయాలు తదితర శాఖల వాటిని టార్గెట్ చేస్తారు.
    అయితే ప్రభుత్వం ఇలాంటి వారిని ఏరి వేసే చర్యకు ఉపక్రమించిందని, అసలు ఏదో, బ్లాక్ మైలింగ్ ఏదో తెలుసుకునే పనిలో ఉన్నందున గత నవంబర్ లో రావాల్సిన ప్రెస్ అక్రిడేషన్ జి. ఓ నేటికీ రాకపోవటానికి కారణంగా కొందరు పేర్కొంటున్నారు. నకిలీలపై కేసులు పెట్టి జర్నలిజాన్ని ప్రక్షాళన చేసేది దిశగా ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
ఇక యూనియన్లు కూడా ఇలా బెదరింపులు, బ్లాక్మేయిలింగ్ కి, ఎదుటివారికి ఆత్మగౌరవానికి భంగం కల్గించే విధంగా వార్తలు రాసేందుకు పాల్పడితే వెంటనే సంబంధిత పోలీస్ స్టషన్లలోనూ, ఆయా జిల్లా సమాచార శాఖాధికారులకు తెలియచేస్తే తగిన చర్యలు తీసుకోవటం సాధ్యం అవుతుందని ఆయా వర్గాలు తెలిపుతున్నాయి. అసలు ఆ పత్రికకు ఆర్ ఎన్ ఐ రిజిస్ట్రేషన్ ఉండాలి. లేదంటే జైలే గతి.
 ఇక పోతే గత ప్రభుత్వం ఇన్ని వందల కోట్లు ప్రకటనల రూపంలో ఇచ్చి దుర్యునియోగం చేశారని కేసులు నమోదు చేసిన ప్రభుత్వం అనేక కష్టానష్టాలకు ఓర్చి నిజాయితీగా నిర్వహిస్తున్న చిన్న మధ్య తరహా పత్రికలకు గడచిన ఐదేళ్ళల్లో ఒక చిన్న ప్రకటన కూడా ఎలాగూ ఇవ్వలేదు.ఇప్పటి ఎన్ డి ఎ ప్రభుత్వం అయినా నెలకొక ప్రకటన ఇచ్చి ప్రభుత్వ సంక్షేమ, అభవృద్ధి పధకాలు ప్రజల్లోకి తీసుకెళుతున్న ఆయా నిజాయితీ కలిగిన పత్రికలు పడుతున్న కష్టంలో కొంత చేయుట ఇచ్చి ప్రోత్సాహం ఇవ్వాల్సివుందని చిన్న, మధ్యతరహా పత్రికల నిర్వాహకులు కోరుతున్నారు.
ఇలావుండగా కొత్త ప్రెస్ అక్రిడిటేషన్ జి. ఓ రూపొందించటంలో రాష్ట్ర సమాచారం శాఖ కసరత్తు పూర్తీ అయిందని, ఆర్ ఎన్ ఐ నెంబరు లేని పత్రికలు, గతంలో కొన్ని జిల్లాల్లో మంజూరైనా యూట్యూబ్ ఛానెల్ల అక్రీడేషన్లు రద్దు చేసి పక్కడబందిగా జి. ఓ రూపొందించినట్లు తెలిసింది.
ఎవరైనా అక్రమంగా మీడియా పేరుతో బ్లాక్మెయిల్ కి పాల్పడిన, ఎదుటివారి పరువుకి భంగం కల్గించె వార్తలు రాసినా వారిపట్ల చట్టం చేతులు బారుగా వున్నాయని, అలాంటి జర్నలిజం ముసుగులో కాలం వెళ్ళదీస్తూ బ్రతుకు తెరువు సాగిస్తున్న అక్రమ వ్యక్తులను పోలీసులకు లేదా సంబంధిత శాఖలా అధికార్లకు ఫిర్యాదు చెయ్యాల్సి వుంది.
Next
This is the most recent post.
Previous
పాత పోస్ట్
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: