18వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం ప్రారంభం అయింది. ఇది మనిషి జీవితంలో పెను మార్పులు తెచ్చింది. అదే విధంగా పెట్టుబడిదారులకి ఇది వరంగా మారింది. వ్యవసాయం తగ్గి, పరిశ్రమలు ఎక్కువగా నెలకొల్పబడ్డాయి. చదువుకున్న వారికి కొత్త రంగాల్లో అవకాశాలు వచ్చాయి. అదే సమయంలో కాలుష్యం పెరిగింది. కార్మికులు హక్కులు కాలరాయబడ్డాయి.
మే డే ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. చాలా దేశాలలో మే దినం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం గా జరుపుతారు. కార్మికుల పోరాటం మరియు కార్మికుల ఐక్యతను గర్హిస్తూ నిర్వహించే సంబరం ఇది.
మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలో వున్న కొంతమంది రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో వుండే కార్మికవర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు. ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమaయంలో మేమూ మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయి. ఈ చాకిరీ మేం చేయలేమని పని ముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడటం, చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం. 24 గంటలలో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి (రెస్టు), ఇంకా ఎనిమిది గంటలు రిక్రీయేషన్ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు. ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత కలిగిన మార్పు. యాంత్రికయుగం రాకముందు మనిషి గంటలకొద్దీ పనిచేసేవాడు. అదొక బానిస బతుకు. మనిషి తన విజ్ఞాన పరిశోధనల మూలంగా యంత్రాలను సృష్టించుకున్నాడు. యాంత్రిక యుగంలో క్యాపిటలిజం ఏవిధంగా పెరిగిందో అదే స్థాయిలో సామాజిక స్పృహ, చైతన్యం కూడా పెరిగాయి. అందువల్లనే పనిగంటల పోరాటం వచ్చింది.
కానీ మనలాంటి దేశంలో చికాగో కంటే ముందే కలకత్తాలో కార్మికులు నిర్ణీత పనిగంటల కోసం హౌరా రైల్వేస్టేషన్‌లో 1862లో సమ్మెచేశారు. అప్పటివరకు ఆ రైల్వే కార్మికులు 10 గంటలు పనిచేసేవారు. అప్పుడే బెంగాల్ పత్రికల్లో పాలకవర్గానికి చెందిన అధికారులు ఎన్ని గంటలు పనిచేస్తారో మేము కూడా అన్ని గంటలే పనిచేస్తామని డిమాండ్ చేశారు. కాగా, అది విస్తృత స్థాయిలో ప్రజా పోరుగా మారలేదు. కాబట్టి ఆ సంఘటన ఉద్యమ స్వరూపాన్ని అందుకోలేదు.
1923లో మొదటిసారి మన దేశంలో 'మే డే'ను పాటించడం జరిగింది. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడటం మూలంగా అప్పటినుంచే కార్మికవర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. అప్పటినుండి 'మే డే'ను పాటించడం జరుగుతుంది.మరలా కార్పొరేట్ కంపెనీలు పని గంటలు పెంచేందుకు ఆలోచనలు చేస్తున్నాయి. పని గంటలు పెంచడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. పని చేసే వారికి పని పట్ల ఆసక్తి కోల్పోతారు.
Post A Comment:
0 comments: