ఖమ్మం జిల్లాకు ముగ్గురు వర్చ్యువల్ మంత్రులు..
ఖమ్మం జిల్లాకు ముగ్గురు వర్చ్యువల్ మంత్రులున్నారని, జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించబోతున్నామని మంత్రి కోమటి రెడ్డి వెంట రెడ్డి తెలిపారు. ప్రభుత్వాసుపత్రులలో వైద్య సేవలు మెరుగుపరిచి పేదలకు మంచి వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని చెప్పారు. కార్పొరేటర్ స్థాయిలో పేదలకు వైద్యం అందించాలనే సంకల్పంతో పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీల సంఖ్య పెరిగిందని, మాత శిశు ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.
Post A Comment:
0 comments: