విజయవాడ టూ తిరుపతి.. ఇకపై నాలుగున్నర గంటలే.. రయ్..రయ్‌మని దూసుకెళ్లొచ్చు

ఈ వందేభారత్ ట్రైన్ మంగళవారం మినహా వారంలో మిగిలిన ఆరు రోజులు నడవనుంది. ట్రైన్ నెంబర్ 20711తో విజయవాడలో ఇది ఉదయం 5.15 గంటలకు బయల్దేరి.. ఎస్‌ఎంవీటీ బెంగళూరుకి 14.15 గంటలకు చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో 20712 నెంబర్‌తో బెంగళూరులో మధ్యాహ్నం 14.45 గంటలకు స్టార్ట్ అయి.. విజయవాడకు 23.45 గంటలకు చేరుకుంటుంది

తెనాలి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, కృష్ణరాజపురం స్టాప్‌లు కాగా.. విజయవాడ(ఉదయం 5.15) నుంచి తిరుపతి(ఉదయం 9.45)కి కేవలం నాలుగున్నర గంటలు మాత్రమే ప్రయాణం ఉండనుంది. ఇప్పటివరకు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లేవారికి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, మూడు రోజులు మాత్రమే నడిచే కొండవీడు ఎక్స్‌ప్రెస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ వందేభారత్ రైలు వస్తే.. ఇకపై ఆ ప్రయాణీకుల కష్టాలు తీరనున్నట్టే.

Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: