రేషన్ వాహనాల రద్దుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు



AP: ఇంటింటికీ రేషన్ వాహనాలను ప్రభుత్వం రద్దు చేయడంపై డ్రైవర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హఠాత్తుగా తొలగించడంతో రోడ్డున పడ్డామని వారు వాపోయారు. 2027 వరకు రుణ వాయిదాలు చెల్లించాల్సి ఉందన్నారు. తమకు ఆర్థిక పునరావాసం, ప్రత్యామ్నాయ ఉపాధి చూపలేదని పేర్కొన్నారు. దీంతో వాహనాలు ఎందుకు రద్దు చేశారో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులిచ్చింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: