ఈ బృందంలో టీడీపీ ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు*
ఉగ్రవాదంపై పోరుపై ప్రపంచ పర్యటన నిర్వహిస్తున్న అఖిలపక్ష బృందాల్లో ఒకటైన సుప్రియా సులే నేతృత్వంలోని బృందం ఇథియోపియా దేశ రాజధాని అద్దిస్ అబాబాలో పర్యటిస్తోంది. ఇథియోపియా మాజీ ప్రధాన మంత్రి హైలేమరియం డెస్సాలెగ్న్ తో ఈ బృందం భేటీ అయ్యి.. పాకిస్థాన్ దేశం చేస్తున్న మత విద్వేషాలను రెచ్చగొట్టడం, ఉగ్రవాదాన్ని పోషించడం వంటివి వివరించారు. పాక్ పై ఆంక్షలు విధించి ఉగ్రవాదాన్ని సమూలంగా రూపుమాపే భారతదేశం యొక్క సందేశాన్ని ప్రపంచానికి చాటుతున్నట్లు ఈ బృందం వివరించగా.... ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలో దీనిని ఎదుర్కోవడంలో కట్టుబడి ఉన్నట్లు సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రధానంగా మీడియా, పౌర సమాజం, విద్యావేత్తలు, భారతీయ సమాజం వంటి విస్తృత శ్రేణితో ఈ బృందం సమావేశం అవుతుంది.
ఈ బృందంలో :
ఎంపీలు.. సుప్రియా సులే, లావు శ్రీకృష్ణ దేవరాయలు, రాజీవ్ ప్రతాప్ రూడీ, మనీష్ తివారీ, అనురాగ్ సింగ్ ఠాకూర్, విక్రమ్‌జీత్ సింగ్ సాహ్నే, ఆనంద్ శర్మ, వి. మురళీధరన్, సయ్యద్ అక్బరుద్దీన్ (ఐక్యరాజ్యసమితికి భారతదేశ మాజీ శాశ్వత ప్రతినిధి) ఉన్నారు.
Post A Comment:
0 comments: