చెంచు కాలనీ సమస్యలు పరిష్కరించడంలో విఫలమైన అధికారులు

సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ 
జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ 

వెలుగోడు పట్టణం లో వున్న చెంచు కాలనిలో సమస్యలు కోకొల్లలుగా వున్న వాటిని పరిష్కరించడంలో అధికారులు విఫలమైయ్యారని సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ ఆరోపించారు వెలుగోడు పట్టణంలో చెంచుకాలానిలో నిర్వహించిన సమావేశం లో రవిరాజ్ మాట్లాడుతూ కాలనిలో మురికి కాల్వలు మంచినీటి కోలాయి లు విధిలైట్లు సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న చెవిటి వాడి ముందు శంఖం వూదిన చందంగా తయారయ్యారని ఆయన ఆరోపించారు అధికారులకు ఏ మాత్రం చిత్తశుద్ధి వున్నా కాలనిలో సమస్యలు పరిష్కరించాలని లేని తరుణం లో సంబంధించిన కార్యాలయం ముందు ఆందోళనలు నిర్వహిస్థామని వారు హెచ్చరించారు ఈ సమావేశం లో భూదేవి పాపులమ్మ మహిళలు తదితరులు పాల్గొన్నారు
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: