*🔥నకిలీ విలేకరుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది..*

*💥వివిధ పత్రిక రంగంలో పనిచేస్తున్నామని చెప్పుకొస్తున్నారు కానీ..!!*

*🌈మాయ మాటలు చెబుతూ ప్రభుత్వ కార్యాలయాలలో చలామణి...*

*💫ప్రభుత్వ అధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తున్న కొందరు విలేకరులుగా చెలామణి అవుతున్న కేటుగాళ్లు..*

విలేకరులు అంటే ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పనిచేయాల్సిన విలేకరులు కొన్ని అనామక చానెల్స్ ని అడ్డం పెట్టుకొని కొందరు విలేకరుల ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారు అనేది జగమెరిగిన సత్యం.. అసలు ఎటువంటి అర్హత లేని వారు విలేఖరులుగా చెలామణి అవుతున్న ఈ సమయం లో ఒక సంస్థ గుర్తింపు కార్డు ఇచ్చి వారికి ఎటువంటి అర్హత ఉంది వారి విద్యార్హత ఎంత అని చెక్ చేసి మరీ ఐడీ కార్డులు జారీ చేసినటువంటి ఐడీ కార్డులు ఇప్పుడు చెల్లడం లేదు అని అంటే నకిలీ విలేకరుల వలన ఈ యొక్క దౌర్భాగ్యం దాపురించింది. 

కానీ ప్రస్తుత సమాజంలో ఎవరు సామాన్యుడి సమస్యను అధికారులకు దృష్టికి తీసుకు వెళ్లే విధంగా వార్తలు రాసే విలేకరులు ఎంతమంది ఉన్నారు అనేది ప్రభుత్వ అధికారులకు మాత్రం తెలియని లెక్క ఎందుకంటే రోజురోజుకు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్న కొన్ని ఊరు పేరు లేని అనామక పత్రికలు మరియు యూట్యూబ్ ఛానల్స్. ఇలాంటి ఊరు పేరు లేని ఛానల్ మరియు పత్రికలు ఇచ్చే ఐడికార్డులు తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటితో ఎక్కడపడితే అక్కడ దందాలు చేస్తున్నటువంటి కొందరు నకిలీ విలేకరులుగా చెలామణి అవుతున్న నకిలీల వలన అధికారులే తలలు పట్టుకుంటున్న సందర్భాలు ఎన్నో. ఎవరు అసలైన విలేఖరి ఎవరు నకిలీ విలేకరి అని తేల్చుకోలేని పరిస్థితిలో అధికార యంత్రాంగం సైతం తలమునకులైన తేల్చుకోలేని స్థాయిలోకి నకిలీ విలేకరుల దందా చేరుకుంది. అర్హత ఉన్న విలేకరులకు ఇచ్చే అక్రిడేషన్ కార్డులు సైతం అక్రమార్కుల చేతులకు వెళ్లడంతో వాళ్లు నిజమైన విలేకరులు ఏమో అని విధంగా అన్ని ప్రభుత్వ శాఖలను నమ్మిస్తూ, నటిస్తూ కాలం వెళ్లదీస్తున్న వారు ఎందరో ఈ జర్నలిజాన్ని అడ్డుపెట్టుకొని. ఇటువంటి వారి వలన ఎందరో సీనియర్ జర్నలిస్టులు సైతం ఒక్కొక్కసారి ముప్ప తిప్పలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

సమాజంలో జరిగే సమస్యల పై కాకుండా వారి యొక్క ఫోకస్ అంతా కూడా ఎవరిని ఎలా దోచుకోవాలా ఎప్పుడు ఎక్కడ దందా చేద్దామా అనే విధంగా వారి ఆలోచనా విధానం ఉండడంతో ఎప్పటికప్పుడు అసలు సిసలైన విలేకరులను కూడా ప్రజలు నమ్మలేని పరిస్థితి సమాజంలో మీడియా విలువలు తుంగలోతొక్కి జర్నలిజాన్ని బ్రష్టు పట్టిస్తున్న ఎందరో మహానుభావులు ఎప్పటికప్పుడు కొత్తదారుల్లో ప్రజలను దోచుకోవడానికి మాత్రమే మీడియాను అడ్డం పెట్టుకొని మీడియాలో దొంగ ప్రవేశం చేస్తున్నారు అనేది మాత్రం నిజం. ప్రజా సమస్యలపై ఒక అవగాహన ఉండదు ప్రజా సమస్యను అధికారులు దృష్టికి తీసుకువెళ్లే విధానం తెలియదు, మన చుట్టూ ఏం జరిగినా పర్వాలేదు మనం ఎదుటివాడిని దోచుకోవడం మాత్రమే మన లక్ష్యం అనే విధంగా కొనసాగుతున్నటువంటి కొందరు కేటుగాళ్ల వలన సమాజం బ్రష్టు పట్టిపోతుంది అనేది మాత్రం నూటికి నూరుపాళ్ళు నిజం. ప్రజా సమస్యలపై పోరాటం చేసే నిజమైన జర్నలిస్టులు ఎప్పుడూ కూడా పేదరికంలో మగ్గిపోతూ తమ కుటుంబాలను సైతం పోషించుకోలేని స్థాయిలో ఈరోజు కాలం వెళ్లదీస్తున్నారు అంటే జర్నలిజం ముసుగులో కొందరు దొంగలు చేరడం వలనే. జర్నలిజంపై మక్కువ వచ్చి కటిక పేదల బ్రతుకుతున్నా ఎంతో మంది సీనియర్ జర్నలిస్టులు ఇప్పటికీ తమ యొక్క నీతి నిజాయితీని ఎవరి వద్ద అమ్మకానికి పెట్టలేక ఎవరి ముందు మోకరించలేక తమ నీతినిజాయితీని రూపాయికి అమ్ముకోలేక పేదరికంలో మగ్గిపోతున్న కూడా తమ విలువలు ఎక్కడా దిగజారిపోకుండా ఒక్క పూట తినడానికి కూడా నోచుకోలేని దయనీయ స్థితిలో ఎంతోమంది విలేకరులు ఉన్నారు. అలాంటి వారికి ప్రభుత్వం చేయూతని ఇచ్చి వారిని ఆర్థికంగా ఆదుకోగలిగితే మన యొక్క ప్రభుత్వాల స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే విధంగా విలేకరులు కృషి చేస్తారు కానీ ప్రభుత్వాలే విలేకరులను పట్టించుకోకపోతే ఆ విలేకరులు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు. 

అర్హత ఉన్నవాడికి అక్రిడేషన్ అనేది దొరకడం లేదు కారణం డబ్బు ఉన్నవాడికే అక్రిడేషన్ అందుబాటులో ఉంది అంటే పత్రికా విలువలు మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అక్రిడేషన్ విలువ ఎంతలా పడిపోయిందో ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. మాయ మాటలు చెబుతూ వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతూ నకిలీ విలేకరులే ఈ సమాజంలో చలామణి అవుతున్నారు. సంస్థ ఇచ్చిన ఐడి కార్డు ఉన్న విలేకరులనేమో..!! వీళ్లు విలేకరులు కాదు..!! వీళ్లకు అక్రిడేషన్ కార్డు లేదు..!! అంటూ ప్రభుత్వ కార్యాలయాల అధికారులకు తప్పుడు సమాచారాలు ఇస్తూ కించపరిచే విధంగా కొందరు విలేకరులు వ్యూహాలు పన్నుతున్నారు. వారికి మాత్రం సంస్థ గుర్తింపు కార్డు లేకపోయినా పర్వాలేదు.. అక్రిడేషన్ కార్డు లేకపోయినా అవసరం లేదు.. అలాంటి వారికి మాత్రం ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు మాత్రం వారికే విలువలిస్తున్నారు. కొందరు విలేకరులు మాత్రం అధికారులకు తప్పుడు సమాచారం ఇస్తూ అధికారులను తప్పు ద్రోవ పట్టించే విధంగా విలేకరులగా నమ్మించి వారి వారి గ్రంధాలు సజావుగా చేసుకుంటూనే ఉన్నారు. నకిలీ విలేకరులు మాత్రం ఏ సంస్థ గుర్తింపు కార్డు లేకపోయినా వారు మాత్రం అధికారుల ముందు విలేఖరి గా చలామణి కావచ్చు. కానీ సంస్థ గుర్తింపు కార్డు ఇచ్చిన వారిని మాత్రం అనేకమైన విధాలుగా ఉన్నతాధికారుల చేత కొందరు విలేకరులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 

*ఇప్పటికైనా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ఉన్నతాధికారులు ఎవరు నిజమైన విలేకరి..!! ఎవరు నకిలీ విలేకరి..?? అని అధికారులు గుర్తించాలని మనవి.*
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: