*తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు*.

*జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి*

తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు.

పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 2 ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కాంగ్రెస్ సర్కార్ వైభవంగా నిర్వహిస్తోంది.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన ఆవిర్భావ సంబురాల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతి నిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కవి అందెశ్రీ రచించిన తెలంగాణ గీతాన్ని అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: