బెంగళూరు రేవ్ పార్టీ కేసు, నటి హేమ అరెస్ట్!


 బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమ అరెస్ట్ అయ్యారు. రేవ్ పార్టీ కేసులో హేమను బెంగళూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఇవాళ హైదరాబాద్‌ వచ్చిన బెంగళూరు సీసీబీ పోలీసులు... నటి హేమను అదుపులోనికి తీసుకున్నారు. రేపు హేమను కోర్టులో హాజరుపర్చనున్నారు పోలీసులు. గత నెల 20న బెంగళూరు రేవ్‌ పార్టీలో పాల్గొన్న హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో రెండు సార్లు హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తమ ముందు విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇవ్వగా... అనారోగ్య కారణాలు చూపుతూ హేమ విచారణకు హాజరుకాలేదు. దీంతో పోలీసులు హైదరాబాద్ వచ్చి హేమను అరెస్టు చేశారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: