ఎంబిబిఎస్ సీట్ల పెంపు మరియు గత ప్రభుత్వం తీసుకొచ్చిన అటువంటి జీవో రద్దు సన్మాన కార్యక్రమం
నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ  గిత్త జయసూర్య గారికి ఘనంగా సత్కరించిన డాక్టర్ వీరం మురళీధర్ రెడ్డి చైర్మన్ వి.ఎం రెడ్డి ఫౌండేషన్ మరియు బీసీ నాయకులు డాక్టర్ బత్తుల సంజీవరాయుడు గారు, వడ్డే శ్రీను గారు, ఈడిగ సూర్యనారాయణ గౌడ్ గారు
  అదేవిధంగా గత ప్రభుత్వము ప్రైవేట్ ఎంబిబిఎస్ కళాశాల మాదిరిగానే గవర్నమెంట్ ఎంబిబిఎస్ కళాశాలలో కూడా 50% సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లగా ఎన్ఆర్ఐ సీట్లుగా 2023 లో జీవో విడుదల చేసి బీసీ ఎస్సీ ఎస్టీ ఓసి విద్యార్థులకు అన్యాయం చేసిన విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువస్తూ దీనిపై మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నందికొట్కూరు నియోజకవర్గ ప్రజల తరఫున మరియు అన్ని సంఘాల తరఫున  గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ జీవోను రద్దు చేయవలసిందిగా  విన్నవించుచుకున్నం అదేవిధంగా ఎంబిబిఎస్ సీట్లను పెంచవలసిందిగా మన ప్రక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో 50 పైగా మెడికల్ కాలేజీలు అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ విద్యార్థిని విద్యార్థులకు ఓసి జనరల్ కాటగిరి కి 500 కంటే తక్కువ మార్కులు వచ్చిన నీటి పరీక్షలో గత సంవత్సరంలో సీటు రావడం జరిగింది కావున మన రాష్ట్రంలో అయితే 543 మార్కులు వచ్చినప్పటికీ ఓసి విద్యార్థులకు ఎంబిబిఎస్ సీట్ దక్కకపోవడం చాలా విచారకరం భదకరం కావున ఈ విద్యా సంవత్సరంలో
ఎంబిబిఎస్ లో చేరు విద్యార్థిని విద్యార్థులకు అన్యాయం జరగకుండా వారి పక్షాన రాష్ట్ర ప్రభుత్వం నిలుచుని భరోసా కల్పించవలసిందిగా
 విన్నవించుకున్న విన్నపం ఏమనగా గత కొన్ని సంవత్సరాలుగా  వైద్య విద్య చాలా ఖర్చుతో కూడినదిగా పరిగణించబడుతుంది దీనికి తోడుగా గత ప్రభుత్వం వైద్య విద్యను కొత్త గా ప్రవేశ పెట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలలో కూడా బి కేటగిరీ (సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్) సీట్లను మరియు NRI సీట్స్ ప్రవేశపెట్టి వైద్య విద్యార్థిని విద్యార్థుల నుంచి సుమారుగా 12 లక్షల రూపాయలు ఫీజును ప్రతి సంవత్సరం వసూలు చేస్తున్నారు దీనికి అదనంగా విద్యార్తులు జిఏస్టీ నీ అదనంగా కట్టవలెను దీనిని దృష్టిలో పెట్టుకొని మీకు విన్నవించు విన్నపం ఏమనగా రాబోయే 2024-2025 వ సంవత్సరం నుంచి ఈ వైద్య విద్యార్థులకు గవర్నమెంట్ వైద్య కళాశాలలో బి కేటగిరీ సీట్లను(సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్) మరియు NRI సీట్స్  రద్దుచేసి అన్ని సీట్లను చాలా తక్కువ ఫీజు తోనే నీట్ ద్వారా భర్తీ చేయవలసిందిగా కోరుచున్నాను గత ప్రభుత్వం చేసినటువంటి జీవోను రద్దు చేసి కొత్త జీవో ద్వారా గవర్నమెంట్ కళాశాలలో బీ కేటగిరి సీట్లను(సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్) మరియు NRI సీట్స్ ,ఈ సంవత్సరం ఆనగా 2024-2025 లో ప్రారంభిస్తున్న మెడికల్ కళాశాల తొ సహా రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి.
             ఇదివరకు అనగా 2022 -2023వ సంవత్సరం మాదిరిగానే అన్ని గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో  MBBS. సీట్స్ కేటాయించి  గ్రామీణ ప్రాంతాల విద్యార్థిని విద్యార్థులకు మేలు చేయవలసింది . ఈ సంవత్సరంలో రాయలసీమ ప్రాంతంలో ఆదోని మరియు పులివెందుల , మదనపల్లి మెడికల్ కళాశాలలు రాబోతున్నాయి కావున దీనిని దృష్టిలో ఉంచుకొని మీరు  ఈ వైద్య విద్య ఫీజుల భారం విద్యార్థుల పై పడకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు భరోసా కల్పించినట్లయితే విద్యార్థిని విద్యార్థులు మీకు హృదయపూర్వక అభినందనలు తెలిపెదరు.
 ఇట్లు 
సదా  సేవలో
డాక్టర్ వీరం మురళీధర్ రెడ్డి
LLB.,M.Sc., MSW., BNYS., Ph.D.
బిజెపి నాయకులు, నందికొట్కూరు 
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: