*ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దే సత్తా గల నాయకులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు - తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్.*
_తెదేపా, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఉయ్యూరు మండలంలోని తెదేపా నాయకులు రాజేంద్రప్రసాద్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి, పుష్పగుచ్చంతో సత్కరించి కేక్ కట్ చేయించడం జరిగింది._
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ....
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో ఆలోచించి నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా అయితే మన బిడ్డలకు, రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని గెలిపించుకున్నారని, జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనే అతని పార్టీ భూస్థాపితం కావడానికి కారణమని, దేశంలోనే మన రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దే సత్తా గల నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే అని రాజేంద్రప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉయ్యూరు మండల పార్టీ అధ్యక్షులు వెనిగళ్ళ కుటుంబరావు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు వేమూరి శ్రీను, టిడిపి నాయకులు చంద్రశేఖర్, కాటూరు గ్రామ పార్టీ అధ్యక్షులు వెంకటనారాయణ, ప్రధాన కార్యదర్శి శరత్,యుగబాబు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: