*కౌంటింగ్ ప్రక్రియకు పటిష్ఠ భద్రత*.

*కౌంటింగ్ విధులు సమిష్టిగా,సమన్వయంతో నిర్వహించాలి.* 

*శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీమతి జి.ఆర్.రాధిక, ఐపీఎస్*. 

శ్రీకాకుళం జూన్ 03.ఎచ్చెర్ల శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం ఉదయం సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద,పరిసర ప్రాంతాలలో విధులలో నిర్వహించనున్న పోలీస్ అధికారులు,సిబ్బందికి కౌంటింగ్ బందోబస్తు విధి విధానాలపై (బ్రీఫింగ్) సోమవారం ఎచ్చెర్ల శివానీ కలశాలలో జిల్లా ఎస్పీ శ్రీమతి జి.ఆర్. రాధిక, దిశ నిర్దేశాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అధికారులు, సిబ్బంది ఒకరికి ఒకరు సమన్వయంతో వ్యవహరిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ, ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.కౌంటింగ్ సెంటర్ లోపలికి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, గుర్తింపు కార్డు పరిశీలన అనంతరం పరిశీలన అనంతరం అనుమతించాలి. ఏజంట్లు అభ్యర్థులు కు  కేటాయించిన మార్గాలు ద్వారా  లోపలికి పంపించాలని,మొబైల్ ఫోన్స్,ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదుని,కేటాయించిన ప్రదేశాలలో వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేయాంచాలి ఏటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు జరగకుండా పకడ్బందీగా బందోబస్తు విధులు నిర్వర్తించాలి,CrPC 144సెక్షన్ అమలలో ఉనందన్న 4 కంటే ఎక్కువ మంది గుమ్ని గూడి ఉండకుండా చూడాలి, విజయోత్సవ ర్యాలీలు, సభలు,సమావేశాలు నిర్వహించడానికి వీలులేదు,కౌంటింగ్ కేంద్రాలలో నిబంధనలకు విరుద్ధంగా కవ్వింపు చర్యలకు, ఘర్షణలకు ఎవరైనా పాల్పడితే వెంటనే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వివిధ పార్టీల అభ్యర్థులకు, ఏజెంట్లకు, ఉద్యోగస్తులకు వేరువేరుగా పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరికి సూచించిన ప్రదేశాలలో వారికి సంబంధించిన వాహనాలను వరుస క్రమంలో పార్కింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ కేంద్రాలు,పరిసర ప్రాంతాలలో  పోలీసు అధికారులు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే వెంటనే తగిన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక బలగాలను కూడా సిద్ధంగా ఉంచామన్నారు. జిల్లాలో ఎక్కడైనా ఘర్షణలకు పాల్పడిన, ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించిన, శాంతి భద్రతల సమస్యలు తలెత్తే విధంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన తీవ్ర చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ  హెచ్చరించారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా బందోబస్తు లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా, అప్రమత్తతో విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు పలు అంశాలపై దిశ నిర్దేశాలు చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు జి ప్రేమ కాజల్, డి గంగాధరం, వి.ఉమా మహేశ్వరరావు,డీఎస్పీలు వై శృతి, ఏ. త్రినాథ రావు, శ్రీనివాసరావు, ఎల్. శేషాద్రి నాయిడు, రాజారావు, సీఐ లు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: