*టూ వీలర్ మెకానిక్ ల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వై వి బి రాజేంద్ర ప్రసాద్*
ప్రపంచ టూ వీలర్ మెకానిక్ దినోత్సవం సందర్భంగా జూన్ 3న,ఉయ్యూరు లో నిర్వహించే కార్యక్రమానికి తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వై వి బి రాజేంద్ర ప్రసాద్ గారిని జిల్లా టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ నాయకులు కలిసి ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు,
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ టూ వీలర్ మెకానిక్ ల సంక్షేమానికి,వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని,గతంలో టీడీపి ప్రభుత్వం చేతి వృత్తుల వారి సంక్షేమానికి ఆదరణ పథకం ద్వారా వారి అభివృద్ధికి కృషి చేసిందన్నారు వైసీపీ ప్రభుత్వం ఆ పథకాలన్నీ తీసివేసిందన్నారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ఆ పథకాలన్నీ ప్రవేశపెట్టి వారిని ఆడుకుంటారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి అక్బర్ బాషా జిల్లా ప్రచార కార్యదర్శి పిఎన్ ఖాన్ ఉయ్యూరు టూ వీలర్ అధ్యక్షులు ఎం జగన్నాథం కార్యదర్శి అబ్దుల్ ఇబ్రహీం కోశాధికారి ఆరేపల్లి మురళి టి నాగరాజు పీ శేషుబాబు ఏ చిన్న ఎం విజయ్ ఎస్.కె అక్బర్ ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment:
0 comments: