భళా ఆఫీసర్స్ ..
బూతుల వీరంగం
అనంతరం కాట్లాట
ప్రజాప్రతినిధులకు ఉచిత వినోదం
ఫిఠాపురంలో కౌన్సిల్ సమావేశంలో... ప్రజాప్రతినిధులు, మీడియా సాక్షిగా.. ఉన్నతాధికారులే ఉచితానుచితాలను విస్మరించారు. బూతుల పంచాగంతో ప్రజాప్రతినిధులకు ఉచిత వినోదం పంచారు. ఈ వినోదాన్ని ఏపీ ప్రజలకు సోషల్ మీడియా సమర్పించింది. వివరాలు ఏంటంటే, శనివారం పిఠాపురం మున్సిపల్ సమావేశంలో కమిషనర్ కనకరావు, డి.ఈ.ఈ భవాని శంకర్ బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు పరస్పర దాడి.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లింపులపై కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ కనకరావు సమాధానం చెప్తూ డి.ఈ.ఈ భవానీపై ఆరోపణలు చేశారు. ఇందుకు ప్రతిగా స్పందించిన డి.ఈ..ఈ కమిషనర్ పై ప్రత్యారోపణలు చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కాట్లాడుకున్నారు. బూతులు వినిపించారు. పరస్పర దాడికి దిగటంతో కింది స్థాయి సిబ్బందిని వీరిద్దరీ అడ్డుకున్నారు. ఈ ఘటనపై ప్రజాప్రతినిధులు ముక్కున వేలు వేసుకున్నారు. గత కొంత కొన్నాళ్లుగా కమిషర్ , డి. ఈ.ఈ ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుండగా... ఈ కౌన్సిల్ భేటీలో తారా స్థాయికి చేరింది.
Post A Comment:
0 comments: