* ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని...

* ఒక్కరోజు ముందుగానే కూటమి పార్టీ నాయకులు, సచివాలయ ఉద్యోగులతో కలిసి పంపిణీ...

* స్వయంగా ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన ఎంఎల్ఏ...

యర్రావారి పాలెం మండలం...

సెప్టెంబర్ 1వ తేదీన ఇవ్వవలసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ ను అవ్వ, తాతలకు ఒకరోజు ముందుగానే ఆగస్టు 31వ తేదీన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అందించారు. యర్రావారి పాలెం మండలం, మేదర పల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ ను కూటమి పార్టీ మండల నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం కావడంతో  ప్రభుత్వం ముందు రోజు ఆగస్టు 31వ తేదిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ 100% పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు.ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్యం వృద్దాప్య, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలకు, మత్స్యకారులకు, HIV వ్యాధి గ్రస్తులకు, చర్మకారులకు, హిజ్రాలకు మరియు డప్పు కళాకారులకు రూ.3,000/- ల నుండి రూ.4,000/- వరకు పెంచడమైనదని, అలాగే వికలాంగుల పెన్షన్ లు రూ.3,000/- ల నుండి రూ.6,000/- వరకు పెంచడమైనదని, DMHO పెన్షన్ లు రూ.5,000/- ల నుండి రూ.10,000/- వరకు పెంచడమైనదని, ఇందులో శాశ్వత వికలాంగులకు రూ.5,000/- ల నుండి రూ.15,000/- వరకు పెంచడమైనదని తెలిపారు. సెప్టెంబర్ 1న ఆదివారం సెలవు దినం ఉన్నందున గౌ. ముఖ్యమంత్రి గారు సదరు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను ఒక రోజు ముందుగానే సచివాలయం సిబ్బంది ద్వారా పెన్షన్ లబ్ధిదారులకు పెంచిన పెన్షన్ ను అందించడం జరుగుతుందని తెలిపారు. పెన్షన్ దారులు ఇంటి వద్దనే ఉండి పెన్షన్ తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కక్షపూరితమైన రాజకీయాలకు తావు లేకుండా చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానని అందరూ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: