TRENDING NOW
పహల్గామ్ దాడి.. వర్షం పడడంతో ఉగ్రవాదుల ప్లాన్ ఛేంజ్
రెండు రోజుల ముందే దాడికి ప్రణాళిక
వర్షం కారణంగా పర్యాటకుల సంఖ్య తగ్గడంతో దాడి వాయిదా
ఏప్రిల్ 22న ఫుడ్ స్టాల్ వద్ద వేచి చూసి పర్యాటకుల రద్దీ పెరిగాక దాడి
పహల్గామ్ లోని బైసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాదులు తొలుత ఈ నెల 20న దాడి చేయాలని ప్లాన్ చేశారని, అయితే ఆ రోజు వ్యాలీలో భారీ వర్షం కురవడంతో దాడిని వాయిదా వేసుకున్నారని అధికారుల దర్యాఫ్తులో తేలింది. వర్షం కారణంగా పర్యాటకులు పెద్దగా రాకపోవడంతో ఉగ్రవాదులు దాడి చేయలేదని అధికారులు తెలిపారు. దాడికి ముందు ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతో వ్యవహరించారని, బైసరన్ వ్యాలీని పలుమార్లు సందర్శించారని చెప్పారు. దాదాపు వారం రోజులు ఆ పరిసరాల్లో తిరుగుతూ సమాచారం సేకరించారని అనుమానిస్తున్నారు. దీంతో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి స్థానికంగా ఉన్న హోటళ్లు, దుకాణాలలోని సీసీ కెమెరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఈ నెల 22న బైసరన్ వ్యాలీలో పర్యాటకుల రద్దీ పెరిగే వరకూ ఉగ్రవాదులు ఎదురుచూశారని అధికారులు చెబుతున్నారు. స్థానికంగా ఉన్న ఓ ఫుడ్ స్టాల్ వద్ద ఇద్దరు ఉగ్రవాదులు వేచి ఉన్నారని తెలిసిందన్నారు. అయితే, ఇక్కడ వేచి ఉండడానికి కారణం పర్యాటకుల రద్దీ కోసమేనా లేక ఏదైనా సంకేతం కోసమా అనే కోణంలో కూడా పరిశోధన చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత పర్యాటకుల రద్దీ పెరిగాక షాపుల్లోకి వెళ్లి మారణకాండ సృష్టించారని చెప్పారు. సాధారణంగా ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతారు కానీ బైసరన్ వ్యాలీలో మాత్రం బాధితుల తలను గురి చూసి కాల్చారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. పర్యాటకులను మతం అడిగి ముస్లిమేతరులను వేరుగా నిలబెట్టి కాల్చి చంపారని వివరించారు.
దుద్దెనపల్లి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ
కరీంనగర్ జిల్లా: సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో మంగళవారం రోజున తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డు లో ఉన్న లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమన్ని కొబ్బరికాయ కొట్టి మాజీ జెడ్పిసి సభ్యులు గుండారపు శ్రీనివాస్, ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వం లో అందరికీ ఆహార భద్రత కార్డు ఉన్నవారికి సన్న బియ్యం దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు సన్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు చిన్న వెంకటేశం, తిరుపతి,చల్ల వెంకన్న,అంజి,నాగరాజు , తదితరులు పాల్గొన్నారు
ప్రపంచ భాషలలో తెలుగు భాషదే అగ్రస్థానం... జాతీయ రచయిత కళారత్న విహారి....
ఆంధ్ర సారస్వత సమితి మరియు తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య ల సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది పురస్కరించుకుని 'తెలుగు_ పద్యం పాట కవిత : చదువుదాం విందాం ఆస్వాదిద్దాం' అనే సాహిత్య కార్యక్రమం మచిలీపట్నం బాలాజీ విద్యాలయంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్ర సారస్వత సమితి వ్యవస్థాపకులలో ఒకరు అయిన నేటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళారత్న అవార్డు గ్రహీత జాతీయ రచయిత శ్రీ విహారి మాట్లడుతూ ఎన్నో అంశాలలో ప్రపంచ భాషలలో తెలుగు భాషదే అగ్రస్థానం అన్నారు. ఆంధ్ర సారస్వత సమితి పుట్టుపూర్వోత్తరాలను సమితి భాషకు చేసిన సేవలను సభ్యులకు తెలియజేశారు. ఆత్మీయులను కలుసుకోవడం, ముచ్చటించటం జాతీయస్థాయి వేదికలలో మాట్లాడినప్పుడు వచ్చే ఆనందం కన్నా మిన్నయని అన్నారు. అతి చిన్న స్థాయి నుంచి ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని నిలబడి సారస్వతానికి 60 సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఆంధ్ర సారస్వత సమితి అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంస్థయని తెలియజేశారు.
ఆంధ్ర సారస్వత
సమితి అధ్యక్షులు శ్రీ కొమరగిరి చంద్రశేఖర్ అధ్యక్షతన, ప్రముఖ న్యాయవాది సాహితీమిత్రులు అధ్యక్షులు ఆంధ్ర సారస్వత సమితి ఉపాధ్యక్షులు అయిన శ్రీ లంకిశెట్టి బాలాజీ నిర్వహణ సారధ్యంలో నిర్వహించబడిన ఈ కార్యక్రమ తొలి పలుకులలో అధ్యక్షులు శ్రీ కొమరగిరి చంద్రశేఖర్ మాట్లాడుతూ చిన్నగా అనుకున్న నేటి సభ ఉన్నతమైన సభగా చాలా బరువైన సభగా మారిందని ముగ్గురు కళారత్న పురస్కార గ్రహీతలు ఈ కార్యక్రమానికి రావడం మా రెండు సంస్థలకు అత్యంత ఆనందాన్నిచ్చిందన్నారు.
సభా నిర్వహణ సారథ్యం వహించిన శ్రీ లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ 50 సంవత్సరముల క్రితం ఆంధ్ర సారస్వత సమితికి అధ్యక్ష, కార్యదర్శులుగా పనిచేసిన శ్రీ విహారి , గుత్తికొండ సుబ్బారావులిరువురికీ ఒకేసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి హంస_ కళారత్న అవార్డు రావడం వీరిద్దరూ గురు శిష్యులు కావడం వీరికి ముందే వీరి శిష్యుడు ప్రపంచ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రముఖ రచయిత డాక్టర్ జీవీ పూర్ణచంద్ గారికి 2017 లోనే హంస కళారత్న అవార్డు రావడం పూర్ణచందు గారు కూడా మన ఈ కార్యక్రమానికి హాజరవ్వడం ఎంతో విశేషం అన్నారు.
తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు పైడిపాటి రామదేవ్ గారు సభను ఉద్దేశించి చిరు సందేశం ఇస్తూ తెలుగు భాష యొక్క ప్రత్యేకతలను తెలియజేశారు. సమాఖ్య యొక్క తెలుగు పుస్తక సంకలనాన్ని 2012 ప్రపంచ తెలుగు మహాసభల్లో పంచినవైనాన్ని సభ్యులకు వివరించారు. తెలుగు అనే ఈ చిరు పుస్తకం ఎప్పటికి ఐదు సార్లు ముద్రించి తెలుగు భాషాభిమానులకు కానుకగా ఇవ్వటం జరిగిందన్నారు.
ఆత్మీయ అతిథిగా విచ్చేసిన జి.వి పూర్ణచంద్ మాట్లాడుతూ వారికి గురువులైన విహారి, గుత్తికొండ సుబ్బారావు గార్ల జీవన రేఖలను వారు పడిన కష్టసుఖాలను, గౌరవాలను అన్నింటినీ సభ్యులకు కళ్ళకు కట్టినట్లు వివరించారు. ఎంత పెద్ద గ్రంథాలలో అయినా ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల పద చిత్రాల పద్యాలు ఉంటాయని అటువంటిది పూర్తి రామాయణం పద చిత్రాలతో పదచిత్ర రామాయణం రచించడం ఒక విహారి గారికే సాధ్యపడిందని, _తన రచనలు పక్కనపెట్టి రాష్ట్రంలో, దేశంలో తెలుగులో ఎక్కడ పుస్తకం అచ్చయినా అది తనదేనని సంబరపడిపోయే మహనీయుడు గుత్తికొండ సుబ్బారావు అని సభ్యులకు తెలియజేశారు.
ప్రముఖ విద్యావేత్త శ్రీ దిట్టకవి వెంకటేశ్వరరావు కళారత్న పురస్కార గ్రహీతలను సభా నిర్వాహకులను తెలుగు పుస్తకంలోని పద్యాలను గానం చేసి సభ్యులను అలరించిన తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య సహాధ్యక్షులు ప్రముఖ హరికథా భాగవతార్ మడమల రాంబాబు గారిని అభినందించారు. సాహిత్య రంగంలో మచిలీపట్నం అందే అగ్రస్థానం అని ఎందరో కవులు రచయితలు మచిలీపట్నం నుండి జాతీయస్థాయికి ఏదిగారని అన్నారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హంస _ కళారత్న పురస్కార గ్రహీత శ్రీ గుత్తికొండ సుబ్బారావు మాట్లాడుతూ పురస్కారం అందుకున్న తర్వాత తాను హాజరైన తొలిసభయిదియని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకు యువత హాజరయ్యేలా చూడాలని సంస్కృతిని అందిపుచ్చుకునే, అభివృద్ధి చేసే తరం రావాలని ఆకాంక్షించారు. 50 సంవత్సరాల క్రితం విహారి గారు అధ్యక్షుడిగా ఉండగా తాను కార్యదర్శిగా నిర్వహించిన కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకుంటూ నేను కళారత్న పొందటం కాదు గురువుగారైన విహారి గారితో కలిసి కళారత్న పొందటం మహదానందంగా ఉందన్నారు.
యువకవి డి శ్రీహరి, డా.ఓలేటి ఉమా సరస్వతి, కారుమూరి రాజేంద్రప్రసాద్, మేడిశెట్టి యోగేశ్వరరావు, గురజాడ రాజరాజేశ్వరి తదితరులు తెలుగుపై స్వీయ కవితలు చదివి వినిపించారు.
ఈ కార్యక్రమంలో త్రిమూర్తులుగా భాసిల్లిన కళారత్న పురస్కార గ్రహీతలను, కార్యక్రమంలో సందేశముల మధ్య మధ్యలో తన గానంతో అలరించిన మడమల రాంబాబు గారిని ఇరు సంస్థలూ ఘనంగా సత్కరించాయి. కవులకు జ్ఞాపికలు అందజేయడం జరిగింది.
ఆంధ్ర సారస్వత సమితి కార్యదర్శి అప్పినేడి పోతురాజు వందన సమర్పణతో ముగిసిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సంఘ సేవకులు కరెడ్ల సుశీల, వై ఎన్ వి సురేష్ బాబు, లంక రాజేష్, వెనిగళ్ళ మహేశ్వరరావు, ఉమ్మిటి విద్యాధర్, శివాజీ గణేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.
నాన్న, తమ్ముడిని బాగు చూసుకో..' అంటూ ఆత్మహత్య..
నిజామాబాద్ (TG) విద్యార్థి రాహుల్ మాదాల చైతన్య అలహాబాద్ ఐఐఐటీలో ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రాత్రి జల్వాలోని హాస్టల్ బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి దూకి చనిపోయాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సూసైడ్కు ముందు 'నాన్న, తమ్ముడిని బాగు చూసుకో అమ్మా..' అని తల్లికి మెసేజ్ పెట్టాడు. దివ్యాంగుడైన రాహుల్ JEE మెయిన్స్లో ఆలిండియా 52వ ర్యాంక్ సాధించారు.
కొమ్మరగిరిపట్టణం, ఆకుల వారి వీధి లో వేంవేచి ఉన్న శ్రీ శ్రీ శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారి దివ్య దర్శనం చేసుకొని, ప్రసాదం స్వీకరించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, పత్తిపాడు నియోజకవర్గం పరిశీలకులు శ్రీ మెట్ల రమణబాబు...
ఈ కార్యక్రమం అల్లవరం మండల అధ్యక్షులు దెందుకూరి సత్తిబాబు రాజు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దున్నాల దుర్గ, శ్రీ సుబ్బాలమ్మ అభివృద్ధి కమిటి చైర్మన్ పెద్దిరెడ్డి పుల్లయ్య నాయుడు మరియు గ్రామ సభ్యులు కొమ్మూరి సత్తిబాబు, గునిశెట్టి రోహిణి కుమార్, ఆకుల చంటి, ఆకుల మామాజీ, సంగీతం తాతాజీ, గిడుగు భాస్కరరావు, ఆకుల మధు, ఆకుల రాము, నల్లా రాము, కుంపట్ల ఏడుకొండలు, ఆకుల బుల్లియ్య, కటికిరెడ్డి బాబి, ఆకుల అచ్చెయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు...
ఏపీలో లంచం తీసుకుంటూ పట్టుబడిన బీఐఎస్ జాయింట్ డైరెక్టర్
ఏపీలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) జాయింట్ డైరెక్టర్ రమాకాంత్ సాగర్ రూ.70వేలు లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు.
సిలిండర్కు బీఐఎస్ మార్క్ కోసం ఓతయారీ కంపెనీ దరఖాస్తు చేసుకోగా.. రమాకాంత్ లంచం డిమాండ్ చేశారు.
దీంతో కంపెనీ ప్రతినిధులు అతడిపై సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈకేసుతో సంబంధం ఉన్న లక్ష్మీనారాయణ రెడ్డి అనే మరోవ్యక్తిని కూడా అరెస్టు చేశారు.
అదృశ్యమైన విద్యార్థులు దొరికారు
- రావులపాలెం రూరల్ సిఐ విద్యాసాగర్
తల్లిదండ్రులు మందలించారని అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆరుగురు విద్యార్థుల జాడను పోలీసులు 24 గంటలు గడవకుండానే తెలుసుకున్నారు.
ఆలమూరు ఖండ్రిగ పేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఈనెల 24వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోగా శుక్రవారం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీ మోహన్ పర్యవేక్షణలో రావులపాలెం రూరల్ సిఐ విద్యాసాగర్, ఎస్సై అశోక్ గాలింపు చర్యలు చేపట్టారు.
సిఐ విద్యాసాగర్ బృందం బాలలను గుర్తించి ఆలమూరు తీసుకుని వస్తున్నారు.
విద్యార్థుల జాఢ కనుక్కోవడానికి కృషి చేసిన మీడియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నరసరావుపేటలో అక్షయ పాత్ర ఫౌండేషన్ 80వ కేంద్రీకృత వంటగదికి భూమి పూజ
-రూ. 15 కోట్ల అంచనాలతో నిర్మాణం
-15000 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భోజన సదుపాయం
-అన్నా క్యాంటిన్ లకు భోజన సరఫరా
-ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కృషితో పల్నాట ఈ కేంద్రం ఏర్పాటు
దేశంలో ఆహార సమస్య, పోషకాహార లోపాలను పరిష్కరిస్తూ శుభ్రతతో రుచికరమైన భోజనాన్ని అందిస్తున్న అక్షయ పాత్ర వారి ఆహార పంపిణీ కేంద్రం పల్నాడులో ఏర్పాటు కాబోతుంది. నరసరావుపేట మండలం, కేసానుపల్లి గ్రామ దగ్గరలో ఎకరం స్థలంలో,, అక్షయ పాత్ర ఫౌండేషన్ వారి 80వ వంటగదికి "భూమి పూజ" వేడుకను ఈరోజు నిర్వహించారు. సుమారు రూ.15 కోట్ల అంచనాలతో కిచెన్ నిర్మాణం జరగనుంది. పల్నాడుతో పాటు పరిసర ప్రాంతాల్లోని 15000 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రుచికరమైన ఆహారాన్ని అందించే లక్ష్యంగా, అన్న క్యాంటీన్ లకు భోజనం పంపిణీ చేసేలా ఈ కిచెన్ నిర్మాణం జరుగుతుంది. ఈ సందర్బంగా టీడీపీ ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు గారు మాట్లాడుతూ..
గత కొన్ని సంవత్సరాలుగా పల్నాడు జిల్లాలో అక్షయ పాత్ర ఫౌండేషన్ ను తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,దాతల మద్దతుతో ఈ రోజు 80వ కేంద్రీకృత వంటగదికి భూమి పూజ చేసాము. అక్షయ పాత్ర పోషకమైన, హైజెనిక్, ఆహార భద్రత, పాఠశాల పిల్లలకు రుచికరమైన ఆహారాన్ని అందించేదిగా గుర్తించబడిందని, నర్సరావుపేటలోని పాఠశాల పిల్లలు ఈ కార్యక్రమంతో ప్రయోజనం పొందుతారని, సమాజానికి గొప్ప సహకారం అందించినందుకు అక్షయ పాత్ర బృందం, దాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట శాసన సభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారు, పల్నాడు జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గారు, అక్షయ పాత్ర ఫౌండేషన్, హరే కృష్ణ మూవ్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ అధ్యక్షుడు వంశీధర దాసు, ట్రస్ట్ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
టీడీపీ ఆఫీసులో అక్కినేని ఫామిలీ!
అక్కినేని నాగార్జున… టాలీవుడ్ లో సీనియర్ నటుడు. రాజకీయాలతో పని లేకుండా ఆయన తన పని ఎదో తాను ఆలా చేసుకుపోతూ ఉంటారు. కారణం ఏమిటో తెలియదు గానీ వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తో నాగ్ చాల ఫ్రెండ్లీగా ఉంటారు. గతంలో అక్రమాస్తుల కేసులో జగన్ జైల్లో ఉండగా.. నేరుగా జైలుకి వెళ్లి మరీ నాగ్ ఆయనను పరామర్శించారు. నాడు ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. జగన్ తనకు మిత్రుడని… అలాగే జగన్ తో పాటు నాడు జైల్లో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ కూడా తనకు మిత్రుడని కూడా నాగ్ చెప్పుకొచ్చారు.
సీన్ కట్ చేస్తే… శుక్రవారం నాగ్ తన ఫామిలీ మెంబెర్స్ తో కలిసి టీడీపీ కార్యాలయంలో కనిపించారు. అది కూడా ఢిల్లీలోని పార్లమెంటులో టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి వెళ్లిన నాగ్.. అక్కడ టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలను బైరెడ్డి శబరీ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోల్లో నాగ్ తో పాటు ఆయన భార్య అమల, కుమారుడు నాగచైతన్య, కోడలు శోభిత ఉన్నారు.
ఢిల్లీ లో అది కూడా పార్లమెంట్ లో…టీడీపీపీ కార్యాలయానికి నాగ్ తన ఫ్యామిలీతో కలిసి వెళ్లడం, అక్కడ టీడీపీ ఎంపీ కనిపించగానే.. ఫోటోలకు ఫోజులిచ్చిన తీరు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. జగన్ తో స్నేహం ఉన్నా ఏనాడూ నాగ్ వైసీపీ ఆఫీస్ కి వెళ్లిన దాఖలా లేదు. అయితే… ఢిల్లీ వెళ్లిన నాగ్ ఇలా టీడీపీ ఆఫీసులో ప్రత్యక్షమవడం ఆసక్తి రేకెత్తిస్తోంది. అయినా.. నాగ్ తన ఫ్యామిలీతో కలిసి ఢిల్లీ ఎందుకు వెళ్లారని ఆరా తీస్తే… తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావుపై ఓ పుస్తకాన్నిఆవిష్కరించే కార్యక్రం ఉండటంతో… ఢిల్లీ వెళ్లిన నాగ్.. పనిలో పనిగా పలువురు రాజకీయ నేతలను కూడా కలిశారట. ఈ క్రమంలోనే.. నాగ్ ఆలా టీడీపీ ఆఫీస్ కి కూడా వెళ్లినట్టు సమాచారం.
యువతకు ఉపాధి కల్పించడమే మా లక్ష్యం...
* రూ.500 కోట్ల పెట్టుబడితో హెచ్ సీ రోబోటిక్స్ విస్తరణ
* ఈ ఏడాది కొత్తగా 500 మందికి.. 3 ఏళ్లలో 2వేల మందికి ఉద్యోగాలు
* ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు ఐటీ కంపెనీలు
* మేం పెట్టుబడులు తీసుకొస్తుంటే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి
* చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అండగా ఉంటాం.. బకాయిలు చెల్లిస్తాం
* రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించి, తెలంగాణ యువతకు ఉపాధి కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని *రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
రాష్ట్రం లో మరో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సెంటిలియాన్ నెట్ వర్క్స్ కు చెందిన హెచ్ సీ రోబోటిక్స్ ముందుకొచ్చినట్లు వివరించారు. ఆ వివరాలను శుక్రవారం కంపెనీ ప్రతినిధులతో కలిసి సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. "హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా సెంటిలియాన్ నెట్ వర్క్స్, హెచ్ సీ రోబోటిక్స్ తొమ్మిది దేశాల్లో డ్రోన్ టెక్నాలజీ, డ్రోన్ సాఫ్ట్ వేర్, టెలి కమ్యూనికేషన్, రోబోటిక్స్, విమాన రక్షణకు సంబంధించిన సాఫ్ట్ వేర్ అభివృద్ధితో పాటు పలు రంగాల్లో సేవలు అందిస్తూ.. 2వేల మందికి ఉపాధి కల్పిస్తుంది.
తాజాగా మరో రూ.500 కోట్లు పెట్టేందుకు ముందుకొచ్చారు. ఫలితంగా ఈ ఏడాది 500 మందికి ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఈ సంఖ్య మూడేళ్ల లో 2వేలకు చేరుతుంది" అని అన్నారు. " ఇప్పటీ వరకు ఐటీ రంగంలో పెట్టుబడులన్నీ హైదరాబాద్ కే పరిమితమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ గల యువతకు ఉద్యోగాలను కల్పించాలనే సంకల్పంతో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించాలని సంకల్పించాం. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నాం. ఆ దిశగా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నాం. సెంటిలియాన్ నెట్ వర్క్స్ సంస్థ ఇప్పటికే తమ కార్యకలాపాలను కరీంనగర్ లో ప్రారంభించింది. మరికొన్ని సంస్థలు కూడా ముందుకొచ్చాయి" అని వివరించారు. "రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అండగా ఉంటాం. వీరికి రావాల్సిన ప్రోత్సాహాకాలు రూ.4500 కోట్లు 2016 నుంచి పెండింగ్ లో ఉన్నాయి. మేం అధికారంలోకి రాగానే ఈ బకాయిలను చెల్లించేందుకు చొరవ తీసుకున్నాం. సహేతుక కారణాలు చూపకపోతే గతంలో పరిశ్రమల ఏర్పాటుకు గతంలో కేటాయించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటాం. ఇతర అవసరాలకు భూములను వినియోగిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. పరిశ్రమల పునరుద్ధరణకు గతంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్లినిక్ పై ప్రత్యేక అధ్యయనం చేస్తున్నాం. దీని వల్ల పరిశ్రమలకు మేలు జరుగుతుందని భావిస్తే అధిక నిధులు కేటాయించి యథావిధిగా కొనసాగిస్తాం"
అని చెప్పారు. "రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం ఉంది. గతేడాది దావోస్ లో చేసుకున్న 18 ఒప్పందాల్లో 17 పట్టాలెక్కాయి. 10 ఒప్పందాల పురోగతి 50 శాతం కంటే ఎక్కువగా ఉంది. కేవలం ఒప్పందాలు చేసుకుని రావడమే కాదు.. వాటిని కార్యరూపంలోకి తెచ్చేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాం. ఈ ఏడాది కూడా మేం రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నాం. మేం ఉద్యోగాలను కల్పించేందుకు పాటు పడుతుంటే.. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ పారిశ్రామికవేత్తలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు" అని ఆరోపించారు. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నడూ భూసేకరణ పనులను అడ్డుకోలేదు. రాష్ట్రం అభివృద్ధి గురించి ఆలోచించాం. ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొడుతూ అభివృద్ధికి అడ్డుపడే ప్రయత్నాలు చేస్తున్నాయి. మాకు రాజకీయాలు కాదు..రాష్ట్రాభివృద్ధే ముఖ్యం. పారిశ్రామికాభివృద్ధికి గత ప్రభుత్వం తీసుకున్న పాలసీలను కొనసాగిస్తాం" అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ సెంటిలియాన్ నెట్ వర్క్స్ ఛైర్మన్, ఎండీ వెంకట్, డైరెక్టర్ రాధా కిషోర్, ఆ సంస్థ ఇండియా ఆపరేషన్స్ హెడ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గ కాపు నాయకులైన సుంకర రమేష్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియామకం చేయడమైనది
: కాపుల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రముఖ కాపు నాయకులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర రమేష్ తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న సుంకర రమేష్ తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన విజయవాడ తూర్పు నియోజకవర్గ కాపు నాయకులకు రాష్ట్ర కమిటీ వారికీ జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు కాపునాడు నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని కాపునాడు సేవా సమితి చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి వారి హక్కుల సాధన కోసం కమిటీ వారు తీసుకునే అన్ని నిర్ణయాలను తూచా తప్పకుండా ఎన్టీఆర్ జిల్లా లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు