కుల గణనపై కేంద్రం కీలక నిర్ణయం- వచ్చే ఏడాది నుంచి ప్రక్రియ ప్రారంభం

కుల గణన, జనాభా లెక్కలపై కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది. ప్రస్తుతం ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ కులగణన ప్రక్రియను వచ్చే ఏడాది నుంచి ప్రారంభించబోతోంది. 

1 అక్టోబర్‌ 2026 నుంచి తొలి దశ కులగణన స్టార్ట్ చేయనున్నట్టు పేర్కొంది. దీన్ని రెండు దశల్లో పూర్తి చేయాలని చూస్తోంది. రెండో దశను మార్చి 1, 2027 నుంచి స్టార్ట్ చేయనున్నారు. 


అదే సమయంలో, లడఖ్, జమ్మూ-కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి పర్వత రాష్ట్రాల్లో అక్టోబర్ 1, 2026 నుంచి జనాభా లెక్కలు ప్రారంభమవుతాయి. కుల గణనతోపాటు, జనాభా లెక్కలు 2 దశల్లో ప్రారంభిస్తారు.

Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: