🎤ఓట్ల లెక్కింపు కు సర్వం సిద్ధం :జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా🎤 ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా తెలిపారు. శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహణ ఏర్పాట్లను ఆయన అధికారులతో కలిసి పర్యవేక్షించా రు.సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రానున్న జూన్ 4వ తేదీ ఉదయం ఏడు గంటలకు కాట్రేనికోన మండలం చే య్యేరు గ్రామంలోని శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూములు ఓపెన్ చేసి కౌంటింగ్ ప్రక్రియను ఎనిమిది గంటలకు ప్రారంభించడం జరుగుతుందని తొలుతగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపును ప్రారంభించి ఉదయం 8:30 గంటలకు అసెంబ్లీ నియోజక వర్గాలు, పార్లమెంట్ సెగ్మెంట్ కు ఈవీఎం లో నిక్షిప్తమై ఉన్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ నేపద్యం లో నాలుగో తేదీ ఇంజనీరింగ్ కళాశాలకు ఇరువైపులా అనాతవరం వైపు కాకినాడ వైపు ట్రాఫిక్కును దారి మళ్లించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు ఈ ట్రాఫిక్ మళ్లింపు వివరాలను ప్రజలకు ముందుగా మీడియా ద్వారా ప్రకటించడం జరుగుతుందన్నారు. ఫెసిలిటేషన్ కేంద్రాలు, ఓం ఓటింగ్, అత్యవసర సేవలు, పోలింగ్ సిబ్బంది ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ పత్రాలను ఒక టేబుల్ పైన, సర్వీస్ ఓట్లను మరొక టేబుల్ పైన లెక్కించడం జరుగుతుందన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజోలు అసెంబ్లీ నియోజక వర్గ ఎన్నికల ఫలితం మొదటగా వెలువడే అవకాశం ఉందన్నారు ఎన్నికల మీడియా కేంద్రంలో హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం ద్వారా ఎప్పటికప్పుడు రౌండ్ల వారీగా ఎన్నికల ఫలితాలను ఆన్లైన్లో పంపడం జరుగు తుందన్నారు. కావున కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రజలు గుంపులుగా రావాల్సిన అవసరం లేదని ఇంటిలో ఎన్నికల ఫలితాల ను టీవీ ద్వారా వీక్షించ వచ్చునని ఆయన స్పష్టం చేశారు. కౌంటింగ్ సందర్భంలో బాణాసంచా మద్యం విక్రయాలపై మరియు లూజు పెట్రోల్ అమ్మకాలపై పూర్తిగా నిషేధం విధించడం ప్రశాంత వాతావరణానికి విఘాతo కలిగించే వారిపై కఠిన చర్యలు గైకొనడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగాను మరియు కౌంటింగ్ కేంద్రానికి రెండు కిలోమీటర్ల పరిధిలో 144 సి ఆర్ పి సి సెక్షన్ ను అమలు చేయడం జరుగుతుందని. పోలింగ్ ప్రక్రియ మాదిరిగానే కౌంటింగ్ ప్రక్రియలో కూడా పూర్తిగా సంయమనం పాటించాలని ఆయన సూచించారు.కౌంటింగ్ పారదర్శకంగా, పకడ్బందీగా అప్రమత్తత ఖచ్చితత్వంతో సిబ్బంది పనిచే యాలని,కౌంటింగ్ కేంద్రంలో తప్పిదాలకు పాల్పడే సిబ్బందిపై కఠిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ఫలితాలు సజావుగా వచ్చేలా వ్యవహ రించాలని తెలిపారు. సిబ్బంది ఎక్కడా సాంత నిర్ణయాలు, ఆలోచనలు, ప్రయోగాలు చేయరాదని, ఎన్నికల నియమావళి తప్పక పాటించాలన్నారు. ఏజంట్ల తో సమస్వయంతో, సహనంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ సెగ్మెంట్ నియోజకవర్గ లెక్కింపు కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం ఓట్ల లెక్కింపునకు వేర్వేరుగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాల్లో ఏర్పాటు చేసిన టేబుళ్లు, సిబ్బంది కూర్చునే విధానం, లెక్కింపు ఏజెంట్లు, ఆర్ఓలు, సూక్ష్మ పరిశీలకుల సీటింగ్ ఏర్పాట్లు, లెక్కింపు కేంద్రాలకు చేరుకునేందుకు ఏర్పాటు చేసిన మార్గ సూచికలు, బారికేడ్లను పరిశీలించారు. ఏజెంట్లు, సిబ్బంది వచ్చి వెళ్లేందుకు మార్గాలను ఆయన పరిశీలించారు. స్ట్రాంగ్ రూముల నుంచి ఈవీఎంలను నేరుగా లెక్కింపు కేంద్రాలకు తీసుకువచ్చే మార్గాలను పరిశీలించారు. రిటర్నింగ్ అధికారులకు సూచనలు చేస్తూ ఆయన పలు ఆదేశాలను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, రిటర్నింగ్ అధికారులు జి కేశవర్ధన్ రెడ్డి, ఏ శ్రీరామచంద్రమూర్తి, కలెక్టరేట్ పరిపా లనాధికారి సిహెచ్ వీరాంజనేయ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు
Post A Comment:
0 comments: