🎤ప్రతి ఏటా క్యాన్సర్ ద్వారా మరణిస్తున్న వారిలో 25 శాతం మందికి పొగాకు కారణం:  జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారిని డాక్టర్ పద్మశ్రీరాణి🎤  ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్స వాన్ని పురస్కరించుకొని పొగాకు వాడకం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు ప్లే కార్డుల నినాదాలు ద్వారా విశదీకరిస్తూ అవగాహన ర్యాలీని కోనసీమ జిల్లా అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రి నుండి గడియార స్తంభం సెంటర్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ ఆసుపత్రి నందు ఏర్పా టుచేసిన సమావేశంలో ఆమె  మాట్లాడుతూ  ప్రతి ఏడాది చాలా మంది పరోక్షంగా సిగరెట్ పొగ పీల్చడం ద్వారా మరణిస్తున్నారు. పొగాకు వాడకం వల్ల సంతనోత్పత్తి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు.. పొగాకు తాగే వారిలో సాధారణ పౌరుల కన్నా  ఎక్కువ శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నా యన్నారు. శరీ రంలోని అన్ని రకాల అవయవాలు దెబ్బ తినే అవకాశం కూడా ఉందని, పొగాకు తాగే వారి లో చర్మం ముడ తలు పడి, త్వరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయన్నా రు.ఇన్ని అనర్థాలకు దారి తీసే పొగాకు నుంచి ప్రజలకు విముక్తి చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988లో మే 31వ తేదీని ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంగా ప్రకటించిందన్నారు. పొగాకు వినియోగం తగ్గించడానికి నిరంతరం కృషి కొనసాగిస్తూనే, ప్రత్యేకించి  పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించడం, పొగాకు వినియోగం వల్ల జరిగే మరణాలను నివారించ డానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, వైద్య ఆరోగ్య రంగాలు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల్లోఅవగాహ న పెంచడానికి కార్యక్రమాలు విస్తృ తంగా చేపట్టాలన్నారు.ప్రజలు కూడా తమ ఆరోగ్య హక్కు కాపాడు కోవడానికి, ఆరోగ్యకరమైన జీవనం కోసం, భవిష్యత్తు తరాలను పొగాకు బారి నుంచి కాపాడే దిశలో ప్రయ త్నాలు పటీష్టo చేయాలన్నారు.. 2024 సంవత్సరం పొగాకు వ్యతిరేక దినం యువతకు వేదిక కావాలన్నా రు. పొగాకు వాణిజ్య సంస్థలు తమ ఆర్థిక ప్రయోజనాల కోసం యువ తను ఆకట్టుకుని, వారిని పొగాకు వాడకానికి బానిసలుగా మార్చడాని కి చేస్తున్న ప్రయత్నాలను ఎండ గట్టాలన్నారు. పొగాకు వినియోగం తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేందుకు అందరూ సమిష్టిగా ఉద్యమించాలన్నారు ప్రస్తుతం జిల్లాలో 28 లoగ్ క్యాన్సర్ కేసులు 59 ఓరల్ క్యాన్సర్ కేసులు ఉన్నాయన్నారు అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని సి హెచ్ పి భరత లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ విధాన రూపకర్తలు సరైన సమయంలో స్పందించకపోతే, ప్రస్తుత, భవిష్యత్ తరాలలో అధిక శాతం పొగాకు వినియోగానికి బానిసలుగా మారే ప్రమాదం ఉందని, పొగాకు రహిత సమాజం కోసం కృషి చేయాలని, ప్రపంచ ఆరోగ్య సంస్థ పొగాకు నియంత్రణ సదస్సు ఇటీవల సూచించిందన్నారు. ప్రాణాంతక వ్యాధులకు సిగరెట్లతో ఆహ్వానం పలకవద్దని ఆమె సూచించారు. ధూమపానం కొంత మంది యు వకులకు ఫ్యాషన్గామారిందని, టీవీల్లో వచ్చే ప్రకటనలు, సినిమాల్లో హీరోలను అనుసరిస్తూ చాలా మంది యువకులు పొగతాగడం అలవాటు చేసుకుంటున్నారన్నారు తెలిసీ తెలియని వయసులో సర దాగా పొగతాగుతున్న వారు రాను రానూ దానికి బానిసలుగా మారు తున్నారన్నారు. ప్రతి సిగరెట్ తమ జీవితకాలంలో ఆయుస్సు ను తగ్గి స్తోందని గ్రహించలేకపోతున్నార న్నారు. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగకూ డదనే నిబంధన ఉన్నా బేఖాతరు చేస్తున్నారన్నారు. ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెం డెంట్ డాక్టర్ శంకర్రావు మాట్లాడు తూ....మే 31వ తేదీ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొగాకు ఉత్పత్తులను నుంచి పిల్లల ను దూరంగా ఉండేలా చేయడం అనే నినాదంతో ఈ ఏడాది అవగా హన కల్పించడం జరుగుతోoదన్నా రు పొగాకు ఉత్పత్తుల వినియోగం కారణంగా వేల మంది వ్యాధుల బారిన పడుతున్నట్లు వైద్య నిపు ణులు అంచనా వేస్తున్నా రన్నారు. వారిలో ఎక్కువగా గుండె జబ్బులు, రక్తపోటు,మధుమేహం, లివర్, శ్వాస కోశ సంబంధిత వ్యా ధులకు గురవుతున్నారన్నారు. లంగ్, గొంతు క్యాన్సర్ బాధితులు ఇటీవల  పెరుగు తున్నారన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం కారణంగా పొగపీల్చేవారు సైతం పలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతు న్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎన్ సి డి, ఆర్ బి ఎస్ కే కోఆర్డినేటర్ ఇంజేటి జాన్ లె వి  ప్రసంగిస్తూ పొగతాగడం వలన శరీర భాగాలైన గొంతు, ఊపిరి తిత్తులు, కడుపు, మూత్ర పిండాల క్యాన్సర్ సోకే అవకాశం ఉందన్నా రు.గుండె రక్తనా ళాలు బిరుసుగా మారి హార్ట్ ఎటాకు దారితీస్తుంద న్నారు.పురుషుల్లో నపుంసకత్వం, మహిళల ఈస్ట్రోజన్ హార్మోన్ల సంఖ్య తగ్గి, రుతుక్రమం త్వరగా నిలిచిపోయే అవకాశముoదన్నారు. శారీరక సామర్థ్యం, ఎముకల పటుత్వం తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మానసిక వైద్య నిపు ల్ణులు డాక్టర్ సౌమ్య, ఈ ఎన్ టి వైద్యులు డాక్టర్ అనూష, జన కళ్యాణ్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది, ఎన్ టి సి పి సోషల్ వర్కర్ ప్రమీల వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: